English | Telugu
డోంట్ టాక్ టు మీ నవీన్... ఎలా కనిపిస్తున్నా నేను నీకు!
Updated : Sep 3, 2023
సుమ అడ్డా షో స్టేజి మీద ఈ వారం ఎపిసోడ్ ఫుల్ నవ్వు తెప్పించేసింది. ఈ షోకి నవీన్ పోలిశెట్టి, మహేష్ ఆచంట, ఆరియానా, శివజ్యోతి ఎంట్రీ ఇచ్చారు. నవీన్ దగ్గరకు ఆరియానా వచ్చి "ఏంటి ఇన్ని నెమళ్ళు ఉన్నాయి నీ డ్రెస్ మీద" అని అడిగింది. "నాట్యం చేస్తాయి ఏం వెళ్తావా నువ్వు" అన్నాడు మహేష్ ఆచంట కామెడీగా. " నవీన్ నాకు కూడా ఒక అబ్బాయిని చూసి పెట్టొచ్చుగా" అని అడిగింది ఆరియానా "ఒరేయ్ ప్లీజ్ నాకు పెళ్లయిపోయింది.. నన్ను ఇబ్బంది పెట్టొద్దు" అని మహేష్ ఆన్సర్ ఇచ్చాడు. "మహేష్ నేను నీ గురించి ఆలోచించట్లేదు నువ్వు అన్న లాంటివాడివని చెప్పేస్తా అందరికీ ..పెళ్లి కానీ నాకు పెళ్లి సమస్య" అంది ఆరియానా. "నిన్ను చూస్తే ఎవరూ అలా అనుకోరు అదే పెద్ద సమస్య" అని కామెడీ కౌంటర్ వేసింది శివజ్యోతి. "సర్ నాకేం తక్కువ" అనేసరికి "నీకు అన్ని ఎక్కువే" అంది శివజ్యోతి. నవీన్ పోలిశెట్టికి ఏమీ అర్ధం కాకా "నీకు పెళ్ళైపోయిందా" అని అమాయకంగా అడిగాడు నవీన్.."డోంట్ టాక్ టు మీ నవీన్..నేను పెళ్ళైపోయిందానిలా కనిపిస్తున్నానా నీకు " అంటూ సీరియస్ గా అలిగి తన పోడియం దగ్గరకు వెళ్ళిపోయింది.
ఇక తర్వాత మహేష్ ఎంట్రీ ఇచ్చి నవీన్ టాలెంట్ గురించి చెప్పాడు "స్టాండప్ కమెడియన్ ఆయన..చితగ్గొటేసాడు. 5 బ్లాకులు, సింగల్ టేక్ లో 30 నిమిషాల్లో చేసాడు" అని చెప్పేసరికి సుమ నవీన్ కి షేక్ హ్యాండ్ ఇచ్చేసింది. "స్టాండప్ కామెడీ అనే క్యారెక్టర్ ని పెట్టి దానికి పూర్తి న్యాయం చేయగలవాళ్ళు టాలీవుడ్ లో ఎవరైనా ఉన్నారంటే అది నవీన్ మాత్రమే" అంది సుమ. నవీన్ నటించిన లేటెస్ట్ మూవీ 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మూవీ కృష్ణాష్టమి రోజు సెప్టెంబర్ 7న రిలీజ్ కి రెడీ అయ్యింది. నవీన్ నటించిన ఏజెంట్ ఆత్రేయ, జాతిరత్నాలు మూవీస్ సూపర్ డూపర్ హిట్ కొట్టాయి. ఇక ఈ మూవీలో కామెడీ ఎలా ఉంటుందో చూడాలి.