English | Telugu
రాజ్ చేసిన ఆ పనికి కావ్య ఏం చేయనుంది!
Updated : Sep 3, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -191 లో... కిచెన్ లో ఉన్న కావ్య దగ్గరికి రాజ్ వచ్చి ఏదో మాట్లాడాలని ట్రై చేస్తాడు. అప్పుడే ఇందిరాదేవి వచ్చి కావ్యని నాతో పంపించు రెడీ చెయ్యాలి.. మీరు తర్వాత మాట్లాడుకోండని రాజ్ తో చెప్తుంది. రాజ్ సరేనని కావ్యని వెళ్ళమని చెప్తాడు.
ఆ తర్వాత వ్రతానికి అంతా సిద్ధం చేస్తారు. కావ్యని రెడీ చేసి ఇందిరాదేవి తీసుకొని వస్తుంది. కావ్యని చూసి అందరూ బాగున్నావని చెప్తారు. అప్పుడే కనకం, అప్పు కలిసి దుగ్గిరాల ఇంటికి వస్తారు. అందంగా రెడీ అయిన కావ్యని చూసి కనకం మురిసిపోతుంది. కనకం, అప్పులని చూసిన కావ్య దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. ఇప్పుడు దుగ్గిరాల ఇంటి కోడలిలాగా ఉన్నావని అప్పు చెప్తుంది. ఆ తర్వాత కావ్యకి కనకం చీర కాసు తీసుకొని వస్తుంది. అది చూసిన రుద్రాణి.. అబ్బో అంత బరువు మోయలేకపోతుందని అనగానే.. అప్పు దానికి కౌంటర్ ఇస్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకని ఇందిరాదేవి అంటుంది.. ఆ తర్వాత కావ్య వరలక్ష్మి వ్రతం చేస్తుంది. వ్రతం పూర్తయిన తర్వాత అందరికి వాయినం ఇచ్చి పంపిస్తారు. కనకానికి కూడా ఇచ్చి కావ్య పంపిస్తుంది. ఆ తర్వాత అందరూ తమ భర్తల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. నువ్వు వెళ్లి రాజ్ దగ్గర ఆశీర్వాదం తీసుకోమని కావ్యకి ఇందిరాదేవి చెప్తుంది. ఆశీర్వాదం కోసం రాజ్ దగ్గరకి వెళ్ళిన కావ్య.. కాళ్ళు మొక్కబోతుంటే రాజ్ వెనక్కి వెళ్తాడు. పైగా అక్షింతలు కిందపడేస్తాడు. అది చూసి అందరూ షాక్ అవుతారు.. నన్ను క్షమించండి, తనని నేను క్షమించలేనని చెప్పి రాజ్ వెళ్ళిపోతాడు. కావ్య చాలా బాధపడుతుంది. రుద్రాణి, రాహుల్, స్వప్నలు హ్యాపీగా ఫీల్ అవుతారు.
ఆ తర్వాత గదిలో ఉన్న రాజ్ దగ్గరకి కావ్య వెళ్తుంది. గదిలో ఉన్న గుట్టుని బయట పెట్టారు. ఇన్ని రోజులు మీలో మార్పు రాకుండా ఉంటుందా? మార్చుకుంటాను అన్న నమ్మకం ఉండేది. ఇప్పుడు అది లేదని కావ్య అంటుంది. వాళ్ళ మాటలు సీతారామయ్య వింటాడు. ఆ తర్వాత అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఉండి నేనేం పొందుతున్నాను. మీ అయిష్టతని సహిస్తున్నాను, ఇష్టం లేకున్నా సహా జీవనం చేస్తున్నానని కావ్య ఎమోషనల్ అవుతుంది. రాజ్ సైలెంట్ గా ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
