English | Telugu

నాకు బిగ్ బాస్ అంటే ప్రాణం.. మా నాన్నను బయటకు రానివ్వను

జబర్దస్త్ లో కమెడియన్స్ తో పాటు మంచి ఫేమస్ చైల్డ్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. అందులో యోధ అనే చైల్డ్ ఆర్టిస్ట్ మనకు బాగా తెలుసు. ఆ చిన్నారి వేసే పంచ్ డైలాగ్స్ కి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. రాకేష్ స్కిట్స్ లో ఈ చిన్నారి ఎక్కువగా కనిపించేది. జడ్జ్ రోజాకు కూడా యోధ అంటే చాలా ఇష్టం. యోధ జబర్దస్త్ కి రావాలంటే వాళ్ళ నాన్న చందుని వెంట బెట్టుకుని వస్తుంది. వాళ్ళ నాన్న కూడా సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్. అలాంటి యోధ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను షేర్ చేసుకుంది. "యోధ నువ్వెప్పుడైనా నాన్నను మిస్ ఐన ఫీలింగ్ వచ్చిందా " అని అడిగేసరికి "నేనెప్పుడూ మిస్ అవలేదు. ఏదైనా మూవీస్ చూసినప్పుడు నాన్న సెంటిమెంట్ వస్తే కనెక్ట్ ఐపోయి ఏడ్చేస్తాను. నాన్న నా పక్కనే ఉంటారు కదా ఇంకెందుకు మిస్ అవుతాను" అని చెప్పింది.

" మీ నాన్నను ఎటైనా ఒక నెల కనిపించకుండా పంపిస్తే" అని యాంకర్ అడిగేసరికి "బిగ్ బాస్ కి పంపిస్తున్నారా" అని అడిగాడు యోధా వాళ్ళ నాన్న చందు. "బిగ్ బాస్ కి పంపిస్తే పక్కా నేను నాన్నను సపోర్ట్ చేస్తా అస్సలు మిస్ అవును. మా డాడీని బిగ్ బాస్ హౌస్ లోంచి అస్సలు బయటకు రానివ్వను. ఎందుకంటే నాకు బిగ్ బాస్ అంటే ప్రాణం.. నేను వెళ్ళను కానీ నాన్నను ఎలాగైనా రికమెండ్ చేసైనా పంపిస్తాను" అని చెప్పింది. "యోధ స్టార్టింగ్ రెమ్యూనరేషన్ 2500 , గోవిందుడు అందరివాడేలే మూవీలో 3500 రెమ్యూనరేషన్ తీసుకుంది. ఎక్కడికి వెళ్లినా యోధతో చాలామంది సెల్ఫీస్ తీసుకుంటారు. అప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆడపిల్లల్ని తీసుకుని యాక్టింగ్ చేయిస్తున్నానని కూడా నా వెనక చాలా మంది మాట్లాడుకుంటారు. కానీ నేను నా వైఫ్ అవన్నీ పట్టించుకోము. యోధకి యాక్టింగ్ ఇష్టం, ప్రాణం తన కోసం ఏదైనా చేస్తాం" అని చెప్పారు యోధ వాళ్ళ నాన్న చందు.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.