English | Telugu
బిగ్ బాస్-7 లేటెస్ట్ ప్రోమో అదిరింది.. సమంత గురించి అడిగిన నాగార్జున!
Updated : Sep 3, 2023
బిగ్ బాస్ సీజన్-7 గురించి రోజు రోజుకి ఉత్కంఠపెరిగిపోతుంది. మరి ఆ ఉత్కంఠతకి తెరతీస్తూ బిగ్ బాస్ కొత్త ప్రోమో రిలీజైంది. నాగార్జున హోస్ట్ గా చేస్తున్న ఈ సీజన్ లో ఇప్పటికే చాలా మంది కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా బయటకు వచ్చేసింది.
కొత్త కంటెస్టెంట్స్ తో ఊహించని ట్విస్ట్ లతో వస్తుంది బిగ్ బాస్ సీజన్ -7. అయితే ప్రతీ సీజన్ ప్రైజ్ మనీ చివరలో అనౌన్స్ చేసి చివరగా మిగిలిన ఇద్దరిలో ప్రైజ్ మనీ తీసుకోమని వెళ్ళిపోమంటారు. అయితే ఈ సారి హౌస్ లోకి వెళ్ళిన వెంటనే తీసుకొని వెళ్ళిపోమన్నాడు నాగార్జున. ఇక డబ్బులున్న ఆ సూట్ కేస్ కోసం హౌస్ లోకి వెళ్లిన కంటెస్టెంట్స్ మధ్య తోపులాట కూడా జరిగినట్లు ఈ ప్రోమోలో చూపించారు. ఈ సీజన్ అంత ఈజీ కాదని నాగార్జున అన్నాడు.
అయితే ప్రోమోలో ప్రియాంక జైన్ వాయిస్ కూడా స్పష్టంగా తెలిసిపోతుంది. ఆమెని హార్ట్ బ్రేకింగ్ నుండి బయటకు రా అని నాగార్జున అనగా తను నవ్వేసింది. మరొకరొని ఏం చేయలానుకుంటున్నావని నాగార్జున అడుగగా.. బిగ్ బాస్ టైటిల్ తోనే బయటకు వస్తానని ఒక కంటెస్టెంట్ అంది. దానికి నాగార్జున.. ఈ సీజన్ అన్ని సీజన్లలా కాదని అన్నాడు. మరి నాగార్జునతో మాట్లాడిన ఆ కంటెస్టెంట్ ప్రియాంక జైనా లేక మరొకరా తెలియాల్సి ఉంది. కాగా హౌస్ లోని రూమ్స్ ఎలా ఉంటాయో చూపించారు మేకర్స్. ఇక ఖుషీ మూవీ ప్రమోషన్ లో భాగంగా విజయ్ దేవరకొండ స్టేజ్ మీదకి వచ్చాడు. వచ్చీ రాగానే 'ఎక్కడ మీ హీరోయిన్ సమంత' అంటూ నాగార్జున అనగానే.. వదిలేయండి అన్నట్టుగా విజయ్ దేవరకొండ స్కిప్ చేశాడు. ఇక ఈ రోజు రాత్రి 7 గంటలకి గ్రాంఢ్ లాంచ్ అవుతున్న అతిపెద్ద షో బిగ్ బాస్ కి రంగం సిద్ధం అయింది. ఉల్టా పల్టా ట్యాగ్ తో వస్తున్న ఈ సీజన్ ఎలా ఉంటుందో చూడాలి మరి!