English | Telugu
వీడియో కాల్ లో వంట నేర్చుకుంటున్న అవినాష్!
Updated : Sep 2, 2023
పెళ్ళాం ఊరెళితే.. పార్టీలు, ఫ్రెండ్స్ అంటూ ఏంజాయ్ చేయొచ్చు. కానీ అవన్నీ రెండు మూడు రోజులే కానీ తర్వాత భార్యని నిజంగా మిస్ అవుతామని ముక్కు అవినాష్ చెప్తున్నాడు. అసలేం జరిగిందంటే.. ముక్కు అవినాష్ అనూజ అనే అమ్మాయిని పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా తన శ్రీమంతం చేసి ఇప్పుడు వాళ్ళ పుట్టింటికి పంపించాడు అవినాష్. ఇక తను పుట్టింటికి వెళ్ళాక ఇల్లంతా బోసిగా ఉందని, తనని చాలా మిస్ అవుతున్నాని అవినాష్ అంటున్నాడు. ఇక ఇదే పనిగా వంట కూడా నేర్చుకుంటున్నాడు. ఇక అవినాష్ భార్య అనూజకి వీడియో కాల్ చేసి వంట ఎలా చేయాలో నేర్చుకుంటున్నాడు. ఇదంతా ' వీడియో కాల్ లో వంట నేర్చుకుంటున్నా' అనే వ్లాగ్ లో చెప్పాడు అవినాష్.
జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాష్ ప్రస్తుతం బుల్లితెరపై కనిపించే షోస్ లో తన కామెడీ టైమింగ్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు. మొదట మిమిక్రీ కళాకారునిగా గుర్తింపు తెచ్చుకున్న అవినాష్.. జబర్దస్త్ స్టేజ్ మీద తన ముక్కుతో చేసిన ఒక స్కిట్ బాగా హిట్ అయింది. అప్పట్లో ముక్కుతో చేసిన ఆ స్కిట్ కి అత్యధిక వ్యూస్ వచ్చాయి. దాంతో ముక్కు అవినాష్ ట్రెండింగ్ లోకి వచ్చాడు.
ముక్కు అవినాష్, కెవ్వు కార్తిక్ కలిసి జబర్దస్త్ స్టేజ్ మీద ఎన్నో సక్సెస్ ఫుల్ స్కిట్స్ చేసి కామెడీని పండించారు. ఆ తర్వాత సినిమాలలో కూడా అవకాశాలు రావడంతో ఇద్దరు బిజీ అయ్యారు. అయితే ముక్కు అవినాష్, అనూజ అనే అమ్మాయిని పెళ్ళి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. రెగ్యులర్ గా తన యూట్యూబ్ ఛానెల్ లో వ్లాగ్స్ చేస్తూ అప్లోడ్ చేసే అవినాష్.. తన ప్రతీ అప్డేట్ ను తన ఫ్యాన్స్ కి తెలిసేలా చేస్తున్నాడు. 'మా కొత్త ఇల్లు', 'అమెరికాలో మా అల్లరి', 'ఈసారి భోనాలకి అనూజ రాలేదు ఎందుకంటే', 'ఇద్దరు ముగ్గురు అయ్యేవేళ' అనే వ్లాగ్స్ ని తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేయగా అత్యధిక వీక్షకాధరణ పొందాయి. గత వారం క్రితం వాళ్ళ అమ్మ హాస్పిటల్ లో ఉందని వ్లాగ్ చేయగా చాలామంది స్పందించారు. రీసెంట్ గా తన భార్య అనూజది శ్రీమంతం గ్రాంఢ్ గా సెలబ్రేట్ చేశాడు ముక్కు అవినాష్. ఇక పుట్టింటికి వెళ్ళి సోలో లైఫ్ ని లీడ్ చేస్తున్న అవినాష్.. మరో కొత్త వ్లాగ్ ని అప్లోడ్ చేశాడు. ఇందులో తన కోసం చాలా ఎమోషనల్ అయినట్టుగా చెప్పాడు అవినాష్. రెండు రోజులు బాగుంటుంది, ఆ తర్వాత చాలా మిస్ అవుతామంటూ ఎమోషనల్ గా చెప్పాడు అవినాష్. కాగా ఇప్పుడు ఈ వీడియో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.