English | Telugu
కృష్ణని ముకుంద ఎందుకు బయటకు తీసుకెళ్ళిందని మురారి టెన్షన్!
Updated : Sep 3, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -252 లో....కృష్ణ ఇంట్లో అందరికి వరలక్ష్మి వ్రతం ఎలా చెయ్యాలి? ఎప్పుడు చెయ్యాలని చెప్పడంతో కృష్ణకి బాగా తెలుసని అందరూ అనుకుంటారు. చాలా బాగా చెప్పావ్ కృష్ణ.. మనమిద్దరం వెళ్లి పూజకి సంబంధించినవన్నీ తీసుకొని వద్దామని ముకుంద చెప్పగానే.. సరేనని కృష్ణ అంటుంది. ఇప్పుడు కృష్ణని ముకుంద ఎందుకు బయటకు తీసుకొని వెళ్తుందని మురారి అనుకుంటాడు. మరొక వైపు రేవతి కూడా అలాగే అనుకుంటుంది.
ఆ తర్వాత ముకుంద ఎందుకు కృష్ణని బయటకు తీసుకొని వెళ్ళిందని మురారి అనుకుంటాడు. మా ప్రేమ విషయం కృష్ణకి చెప్తుందా? కృష్ణ ఎలా రియాక్ట్ అవుతుందో అని మురారి టెన్షన్ పడుతుంటాడు. అప్పుడే మురారి దగ్గరికి మధు వచ్చి.. ఏదో టెన్షన్ లో ఉన్నట్లు ఉన్నావ్.. డ్రింక్ చేద్దామని అనగానే మురారి చిరాకు పడుతాడు. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలుసని మధు అంటాడు. నిన్న గదిలో ముకుంద రాసింది చేంజ్ చేసి రాసింది నేనే అని మధు చెప్పగానే.. అవునా అసలేం జరిగిందని మధుని మురారి అడుగుతాడు. మధు ఎలా చేంజ్ చేసాడో చెప్తాడు. ఆ తర్వాత ముకుంద, మురారి ల ప్రేమ సంగతి ముకుందనే చెప్పిందని మురారీతో మధు చెప్తాడు. కృష్ణ నువ్వు ఎప్పుడు కలిసి ఉండాలని మధు అనగానే.. మధుని మురారి హగ్ చేసుకుంటాడు. ఆ తర్వాత మురారి దగ్గరికి ముకుంద వచ్చి.. రేపు కృష్ణని షాపింగ్ కి తీసుకొని వెళ్తున్నాను, మన ప్రేమ గురించి కృష్ణకి చెప్తానని అంటుంది. నేను చెప్పనివ్వను, నేను వస్తానని మురారి అంటాడు. ఇంకా బాగా చెప్పొచ్చు.. రా అని ముకుంద అంటుంది. మురారి కావాలనే ముకుందని రెచ్చగొట్టేల మాట్లాడతాడు. కృష్ణ గదిలోకి వచ్చేసరికి చాపని దాచిపెట్టి కృష్ణ బెడ్ పై పడుకునేల చెయ్యాలని మురారి వెళ్ళిపోతాడు. ముకుందకి కోపం వస్తుంది.
మరొక వైపు ఎప్పటిలాగే మధు అలేఖ్యల మధ్య చిలిపి తగాధా జరుగుతూనే ఉంటుంది. మరొక వైపు చాప కోసం కృష్ణ వెతుకుతుంటుంది. కృష్ణ బెడ్ పై పడుకోవచ్చు కదా అని మురారి అన్నా కూడా కృష్ణ వినకుండా.. పైన ఉన్న చాపని తీసుకుంటూ.. పడుతుంటే అప్పుడే కృష్ణని కింద పడకుండా మురారి పట్టుకుంటాడు. ఇద్దరు అలా ప్రేమగా చూసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.