English | Telugu
ప్రశాంత్ ని తోసేసి గెలిచిన అర్జున్.. ఇదేం ఆట సామి!
Updated : Dec 6, 2023
బిగ్ బాస్ సీజన్-7 చివరి దశకు చేరుకుంది. ఒకవైపు హౌస్ లో ఓట్ అప్పీల్ కోసం ఫన్ టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. ఇందులో కంటెస్టెంట్స్ మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. అయితే ఇ గొడవలు ఒకరికొకరు కావాలని పెట్టుకుంటున్నారా లేక స్ట్రాటజీనా అనేది హౌస్ మేట్స్ కు ఒకలా, ప్రేక్షకులకు ఒకలా ఉంది.
నిన్న జరిగిన ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ కోసం ఇసుకతో చేసిన కేక్ మీద ఒక చెర్రీని ఉంచి, ఆ చెర్రీ కింద పడకుండా పీస్ లుగా కడ్ చేయాలని బిగ్ బాస్ సూచించాడు. ఇక ఇందులో మొదటి రౌండ్ లోనే ఓడిపోయిన అర్జున్ ని తదుపరి రౌండ్ లకి సంచాలకుడిని చేశాడు బిగ్ బాస్. మొదటి టాస్కులో భాగంగా ఇసుకతో తయారు చేసిన కేకులపై చెర్రీలు పెట్టాడు బిగ్‌బాస్. ఈ టాస్క్ లో ఎవరి చెర్రీ పడిపోతే వాళ్లు ఓడిపోయినట్లే. టాస్క మొదలవగానే కాసేపటికి అర్జున్, యావర్, శివాజీ, ప్రియాంక, శోభాశెట్టి ఓడిపోయారు. ఇక చివరగా ప్రశాంత్, అమర్ దీప్ ఉండగా.. ప్రశాంత్ ఓడి, అమర్ దీప్ గెలిచాడు. అలా ఓటు అప్పీల్ కి అమర్ దీప్ మొదటగా అర్హత సాధించాడు.
రెండవ టాస్కులో భాగంగా గార్డెన్ ఏరియాలో ఓ గంట పెట్టాడు బిగ్‌బాస్. ఇందులో బజర్ మోగినప్పుడు ఎవరైతే మొదటగా వచ్చి గంట కొడతారో వాళ్లే.. ఓట్ అప్పీల్ కోసం రెండవ కంటెండర్ అవుతారని బిగ్ బాస్ చెప్పాడు. ఇక బజర్ మోగిన వెంటనే పక్కనే ఉన్న ప్రశాంత్, యావర్ లని చేతితో పక్కకి తోసేశాడు అర్జున్. అప్పుడు అర్జున్ చేయి ప్రశాంత్ దవడక తగిలి బాగా దెబ్బ తగిలింది. ఇక ఆ పక్కన ఉన్న యావర్‌ని కూడా ఇలానే చేశాడు అర్జున్. దీంతో అందరూ వెళ్లి గంట మీద పడేసరికి ముగ్గురు కింద పడిపోయారు. గంటకి దూరంలో ప్రశాంత్, యావర్ ఉండగా, దాని దగ్గరగా అర్జున్ ఉన్నాడు. తొందరగా అందుకొని గంట కొట్టి ఓట్ అప్పీల్ కోసం అర్హత సాధించాడు అర్జున్.