English | Telugu
శ్రీసత్యను చిరుతపులితో పోల్చిన గీతూ...
Updated : Dec 7, 2023
ఈమధ్య కాలంలో యూత్ కి వర్క్ ప్యాషన్ తో పాటు డివోషనల్ గా కూడా బాగా డెవలప్ అవుతున్నారు. ఇక ఏ కొంచెం టైం దొరికినా సరే గుళ్లకు, గోపురాలకు, విదేశాలకు, బీచ్ లకు చెక్కేసి ఆ ఫొటోస్, వీడియోస్ పోస్ట్ చేసి వాళ్ళ ఫాన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ ని అందిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ లాస్ట్ సీజన్ బ్యూటీస్ గీతూ రాయల్, శ్రీ సత్య అలాగే తిరుమల కార్ లో వెళ్లారు. ఇక వాళ్ళ టీమ్ అంతా కూడా తిరుమలలో ఫుల్ ఎంజాయ్ చేసినట్టే కనిపిస్తోంది.
ఇక తిరుమల ఘాట్ రోడ్స్ లో ఈ మధ్య కాలంలో చిరుతలు తిరుగుతున్నాయని వార్తల్ని కూడా మనం వింటూనే ఉన్నాం. గీతూ కూడా ఆ విషయాన్నే చెప్పింది.."తిరుమలలో చిరుతలు వస్తున్నాయంట కానీ మేమేమీ భయపడాల్సిన పనే లేదు ఎందుకంటే మా కార్లోనే ఒక చిరుత పులి ఉంది కాబట్టి" అంటూ శ్రీ సత్యను చిరుత పులితో పోల్చి ఫన్నీ కామెంట్ చేసింది. ఇక గీతూ కామెంట్ కి శ్రీసత్యకి కోపం వచ్చి "చిరుత పులి వస్తే ముందు లాక్కెళ్లేది నిన్నే ఎందుకంటే కొవ్వెక్కువుంది కాబట్టి" అంటూ కౌంటర్ ఇచ్చింది. ఇక తిరుమలకు వెళ్లి అక్కడ స్వామి వారి దర్శనం చేసుకున్నాక చేతికి గాజులు కొనుక్కున్నారు. అలాగే మామిడి కాయ ముక్కలు కొనుక్కుని తిన్నారు. గీతూ, శ్రీసత్య లాస్ట్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక మంచి ఫ్రెండ్స్ ఇపోయారు. ఇక వీళ్ళు ఎక్కడికంటే అక్కడికి కలిసి వెళ్తూ ఉంటారు అలాగే వీళ్లకు ఫైమా కూడా మంచి ఫ్రెండ్ అయ్యింది. వీళ్ళ టీమ్ మొత్తం కూడా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ ఫాన్స్ ని పెంచుకుంటూ ఉంటారు.