English | Telugu
హౌస్ మేట్స్ పై పొగరు చూపిస్తున్న డమ్మీ కెప్టెన్ అమర్ దీప్!
Updated : Dec 7, 2023
బిగ్ బాస్ సీజన్-7 రోజు రోజుకి ఒక ఇంటెన్స్ డ్రామాని అందిస్తుంది. ఈ సీజన్-7 ఉల్టా పుల్టా థీమ్ ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో విజయం సాధించిందనే చెప్పాలి. గతవారం గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అవ్వడంతో ఈ వారం హౌస్ లో ఏడుగురు హౌస్ మేట్స్ ఉన్నారు. వీరిలో అంబటి అర్జున్ ఇప్పటికే టికెట్ టు ఫినాలే గెలిచి ఫినాలేకి అర్హత సాధించాడు.
ఇక హౌస్ లో ఈ వారం మొత్తం ఓట్ అప్పీల్ కోసం కంటెస్టెంట్స్ చేత ఫన్ గేమ్స్ ఆడిస్తున్నాడు బిగ్ బాస్. ఇందులో హౌస్ మేట్స్ లో గొడవలు జరుగుతున్నాయి. మొన్నటి ఎపిసోడ్‌లో.. ఆ రోజు జరిగిన టాస్క్ లలో గెలిచి శోభాశెట్టి ఓట్ అప్పీల్ చేసుకుంది. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో అంబటి అర్జున్, అమర్ దీప్ ఓట్ అప్పీల్ కోసం టాస్క్ లలో గెలిచి అర్హత సాధించారు.
ఇక వీరిద్దరిలో ఎవరు ఓట్ అప్పీల్ చేసుకోవాలో డిసైడ్ చేయడానికి హౌస్ మేట్స్ మద్దతు కావాలని బిగ్ బాస్ చెప్పడంతో.. ఒక్కో హౌస్ మేట్ తమ అభిప్రాయం చెప్పారు. ప్రశాంత్ తన మద్దతుని అంబటి అర్జున్ కి ఇచ్చాడు. నేను ఎందుకు అనర్హుడని అనుకుంటున్నావని అమర్ దీప్ అనగా.. ఈ ముసుగులో గుద్దులాట ఎందుకు లాస్ట్ వీక్ నిన్ను సపోర్ట్ చేసినందుకు నాకు బాగానే చేసావ్.. అందుకనే అర్జున్ కి సపోర్ట్ చేస్తున్నానని ప్రశాంత్ అన్నాడు. శివాజీ, యావర్ లు కూడా అర్జున్ కి సపోర్ట్ చేయడంతో.. అమర్ దీప్ కి కోపం పెరిగిపోయింది.
ఇక హౌస్ కి నేను కెప్టెన్.. నేను చెప్తున్నాను నువ్వు అక్కడికి వెళ్ళు అంటూ యావర్ పై డమ్మీ కెప్టెన్ అమర్ దీప్ రెచ్చిపోయాడు. యావర్ లా ఇమిటేట్ చేస్తూ.. వాళ్ళు నీ దగ్గర మంచివాళ్ళు అనిపించుకోవాలని నీకు సపోర్ట్ చూస్తున్నారంటూ అర్జున్ తో అన్నాడు అమర్. ఇక ఎప్పటిలాగే శోభాశెట్టి, ప్రియాంక ఇద్దరు అమర్ దీప్ కే సపోర్ట్ చేసారు. అయితే ఈ వారం నామినేషన్ లో ఉన్న అమర్ దీప్ కి ఓటింగ్ తక్కువ ఉందనేది వాస్తవం. కానీ శోభాశెట్టి, ప్రియాంక లీస్ట్ లో ఉన్నారు. మరి వారిద్దరిని హౌస్ లో ఉంచి అమర్ ని బయటకు పంపిస్తారా లేక అమర్ ని కాకుండా అత్యధిక ఓటింగ్ ఉన్న యావర్ ని బయటకు పంపిస్తారా చూడాలి మరి. ఇక ఓట్ అప్పీల్ లో అమర్-ప్రశాంత్, యావర్-అమర్ ల మధ్య గొడవ గట్టిగానే జరిగినట్టు ఈ ప్రోమోలో తెలుస్తుంది.