English | Telugu
రిటర్న్ గిఫ్ట్స్ తో నేను రెడీ..మీరు రెడీనా...
Updated : Dec 6, 2023
చాలా ఏళ్ళ విరామం తర్వాత మంచు మనోజ్ మళ్ళీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆయనే హోస్ట్‌గా ‘ఉస్తాద్ - ర్యాంప్ ఆడిద్దాం’ పేరుతో సరికొత్త సెలబ్రిటీ గేమ్ షో ద్వారా ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ.విశ్వ ప్రసాద్ ఈ గేమ్ షోను రూపొందిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఇక ఈ గేమ్ షో డిసెంబర్ 15 నుంచి ఈటీవీ విన్ యాప్ లో ప్రసారం కానుంది. ఇప్పుడు ఈ షో ప్రోమో కూడా విడుదల చేశారు మేకర్స్. ‘నేను మీ మనోజ్.. నా కథ మీరు రాసుకున్నది, నా రాక మీరు పిలుస్తున్నది..ప్రతీ హీరోని నడిపించే సైన్యం ఫాన్స్ ప్రతీ స్టార్ సంపాదించుకునే ధైర్యం ఫాన్స్ ..అలంటి ఫ్యాన్స్ కి నేనివ్వబోతున్న రిటర్న్ గిఫ్ట్ " అంటూ డైలాగ్ చెప్పాడు మంచు మనోజ్. ఈయన ఆరేళ్ల క్రితం "ఒక్కడు మిగిలాడు" అనే మూవీలో కనిపించాడు. ఇప్పుడు బుల్లితెరపై అలరించేందుకు వచ్చేస్తున్నాడు. ఈ షోకు సంబంధించిన లాంచింగ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ షోలో గెలిచిన ప్లేయర్స్‌కు.. రూ. 50 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వబోతున్నట్లు కూడా ప్రకటించారు.
బిగ్ స్క్రీన్స్ నుంచి అందరూ ఓటిటి వైపు చూస్తున్న ఈ టైంలో మనోజ్ కూడా ఆవైపు ద్రుష్టి సారించారు. ఇంతకాలం వెండితెరపై అలరించిన ఈ రాకింగ్ స్టార్.. ఇక ఓటీటీ, టీవీ ప్రేక్షకులను అలరించడానికి మరో వారంలో అందరి ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ఓటిటి వేదిక మీద "ఫామిలీ ధమాకా" తో విశ్వక్ సేన్, "అన్స్టాపబుల్ " షోతో బాలకృష్ణ అదరగొడుతున్నారు. ఇప్పుడు మంచు మనోజ్ కూడా ఆ రూట్ లోనే వెళ్ళడానికి రెడీ అయ్యారు. మరి ఈ షోతో మంచు మనోజ్ ఎలా అలరిస్తాడు, అసలు ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతాడా లేదా అనే విషయం తెలియాలంటే కొన్ని డేస్ వెయిట్ చేయాలి.