English | Telugu

అమర్ దీప్ ఎలిమినేషన్ ఫిక్స్.. ఇవే కారణాలు!

బిగ్ బాస్ సీజన్-7 లో అసలేం ఆడకపోయిన శోభాశెట్టి, ప్రియాంకల సపోర్ట్ తో ఇప్పటికీ ఉన్న ఏకైక కంటెస్టెంట్ అమర్‌దీప్. ఒక్కటంటే ఒక్క గేమ్ కూడా తన స్వయంకృషితో గెలిచింది లేదనేది అందరికి తెలిసిన నిజం. అయిన బిగ్ బాస్ మాత్రం అమర్ దీప్ ని లాలిస్తున్నాడు. బుజ్జగిస్తున్నాడు కేకులు తినిపిస్తున్నాడు. ఇదంతా చూస్తుంటే దత్తపుత్రిక శోభాశెట్టిని సేవ్ చేసే ప్రాసెస్ లో భాగంగా అమర్‌దీప్ ఎలిమినేట్ అయ్యేలా అనిపిస్తుంది. ఒకవేళ అమర్ దీప్ ఎలిమినేట్ అయితే ఈ సీరియల్ బ్యాచ్ మేట్స్ శోభాశెట్టి, ప్రియాంక ఎలా ఉంటారో చూడాలి.

అయితే నిన్న మొన్నటి దాకా జరిగిన ఓటింగ్ పోల్స్ లో శివాజీ, ప్రశాంత్ మొదటి రెండు స్థానాలలో ఉండగా అమర్ దీప్ మూడవ స్థానంలో ఉండేవాడు. నిన్న జరిగిన ఓటింగ్ లో యావర్ కి 20 శాతం ఓటింగ్ పడి అతను మూడవ స్థానంలోకి వచ్చాడు. దీంతో అంబటి అర్జున్ ఎలాగు ఎలిమినేట్ అవ్వడు కాబట్టి అమర్ దీప్ ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ చాలావరకు ఉంది. గత రెండు వారాలుగా హౌస్ లో ఏ పని చేయకుండా కెప్టెన్ అని ఖాళీగా ఉంటు అందరి చేత పనులు‌ చేపిస్తున్నాడు. అయితే ఇందులో‌ ఓవారాక్షన్ కూడా ఉంది. శోభాశెట్టి, ప్రియాంకలకి అధిక పనులు చెప్పకుండా మిగిలిన వారికి ఎక్కువ పనులు చెప్పడం అందరికి నచ్చట్లేదు. పైగా టాస్క్ లు కూడా ఏం ఆడలేదు.

అమర్ దీప్ కెప్టెన్ అయిన నుండి అతని బిహేవియర్ మరీ రూడ్ గా ఉంది. అందులోను పల్లవి ప్రశాంత్, యావర్ లని ట్రీట్ చేసే విధానంతో ఇది స్పష్టంగా తెలుస్తుంది. తోటి హౌస్ మేట్స్ అని కూడా లేకుండా శోభాశెట్టి, ప్రియాంకలని కూర్చోబెట్టి యావర్ , ప్రశాంత్ లకి అధికంగా పనులు చెప్పడం.. మాటల్లో చులకన చేసి చూడటం ఇదంతా చూసే ప్రేక్షకులకు సైతం చిరాకు తెప్పిస్తుంది. శోభాశెట్టి అయితే మరీ పనివాడు కంటే దారుణంగా ప్రశాంత్ ని చూస్తుంది.‌ ఇది చూస్తున్న జనాలు శోభాశెట్టిపై తీవ్రంగా స్పందిస్తూ.. ప్రతీ ప్రోమో కింద కామెంట్లలో శోభాశెట్టి ఎలిమినేట్ అవ్వాలని తెలుపుతున్నారు. అయితే బిగ్ బాస్ కి శోభాశెట్టి దత్తపుత్రిక కాబట్టి ఎలాగు తనని ఎలిమినేట్ చేయడు. ఏదైన అద్భుతం జరిగితే తప్ప శోభాశెట్టి ఎలిమినేట్ అవ్వదు. ఇక మిగిలింది అమర్ దీప్. ప్రతీసారీ అన్ ఫెయిర్ గేమ్ లు ఆడే కంటెస్టెంట్ హౌస్ నుండి బయటకి వస్తే అది ప్రేక్షకులకు కూడా ఫెయిర్ ఎలిమినేషన్ అనిపిస్తుంది.