English | Telugu
Guppedantha Manasu:గుప్పెడంత మనసు సీరియల్ లో కీలక మలుపు.. రిషి మిస్సింగ్!
Updated : Dec 7, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -948 లో.. మహేంద్ర దగ్గరికి ఫణీంద్ర వచ్చి ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకో అని చెప్తాడు. అప్పుడే దేవయాని కూడా వస్తుంది. నువ్వు కూడ ఇంటికి వెళ్ళు అని మహేంద్ర అనగానే.. నేను వెళ్తే శైలేంద్ర పరిస్థితి ఏంటని దేవాయని మనసులో అనుకుంటుంది. నేను వెళ్ళను ఇక్కడే ఉంటానని దేవాయని చెప్తుంది.
మరొకవైపు మహేంద్ర, వసుధార కలిసి ఇంటికి వెళ్తుంటారు. వసుధార మాత్రం ఇంక రిషి రాలేదని అతని ఫోన్ కి ట్రై చేస్తు ఉంటుంది. కానీ రిషి ఫోన్ స్విచాఫ్ వస్తుంది. దాంతో వసుధార ఇంక టెన్షన్ పడుతుంటుంది. ఏం కంగారు పడకని మహేంద్ర దైర్యం చెప్తాడు. ఆ తర్వాత మహేంద్ర, వసుధార ఇంటికి రాగానే అనుపమ వస్తుంది. శైలేంద్ర గురించి అడిగి తెలుసుకుంటుంది. అనుపమని ఇంట్లోకి కూడా పిలిచేందుకు మహేంద్ర ఇష్టపడడు. ఆ తర్వాత అనుపమతో వసుధార మాట్లాడుతుంది. నిన్ను పోలీస్ లు పట్టుకొని వెళ్లేలా చేసిన నాపైన నీకు కోపం లేకుండా మాములుగా మాట్లాడుతున్నావ్ అంటున్నానే.. అలా అని నిన్ను ఎండీగా ఆర్హురాలివి అని ఒప్పుకోవడం లేదని అనుపమ అనగానే.. మహేంద్రకి ఇంక కోపం వస్తుంది. ఆ తర్వాత వాళ్ళతో పాటు అనుపమ ఇంట్లోకి వెళ్తుంది. కాఫీ నేనే తీసుకోని వస్తానని అనుపమ లోపలికి వెళ్లి కాఫీ చేసుకొని వస్తానని వెళ్ళిపోతుంది. మరొకవైపు శైలేంద్రని ఆ సిచువేషన్ లో చూసిన ధరణి ఎమోషనల్ అవుతుంది. కానీ శైలేంద్ర మాత్రం తనని నటనతో నమ్మించే ప్రయత్నం చేస్తుంటాడు.
మరొకవైపు అనుపమ కాఫీ తీసుకొని వస్తుంది. వసుధార మాత్రం టెన్షన్ గా రిషికి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి.. రిషి గురించి తెలుసుకోవాలని అనుకుంటుంది. అప్పుడే ఎందుకు అలా ఉన్నావని వసుధారని అనుపమ అడగగానే.. రిషి ఇంకా ఇంటికి రాలేదు. మెసేజ్ చేసాడని అనగానే. ఆ మెసేజ్ రిషి చేసాడో రిషి ఫోన్ నుండి ఎవరు చేశారో అని అనుపమ అంటుంది. వసుధార ఇప్పటికే టెన్షన్ పడుతుందంటే.. నువ్వు ఇంకా టెన్షన్ పెడుతావ్ అంటూ మహేంద్ర కోప్పడతాడు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని మహేంద్రకి అనుపమ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.