English | Telugu
Krishna Mukunda Murari:కృష్ణకి పెళ్ళి అయిందని చెప్పిన భవాని.. షాక్ లో మురారి!
Updated : Dec 6, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' కృష్ణ ముకుంద మురారి '. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -333 లో.. భవాని ఇంట్లో అందరిని తీసుకోని కృష్ణ దగ్గరికి వస్తుంది. అలా ఇంటికి అందరు రావడం చూసిన కృష్ణ ఎందుకు వచ్చారని ఆశ్చర్యంగా చూస్తుంది. ఇది ముకుంద మురారీల పెళ్లి పత్రిక.. మొదటి శుభలేక మీకే ఇస్తున్నా అని కృష్ణకి ఇస్తుంది భవాని.
ఆ తర్వాత కార్డ్ ఓపెన్ చేసి చూస్తూ కృష్ణ బాధపడుతుంది. నాకేంటి నా మనసు ఇంత కష్టంగా అనిపిస్తుంది. నేను ఇక్కడ ఉండకపోవడమే మంచిది అని మురారి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కృష్ణకి భవాని వార్నింగ్ ఇస్తుంది. పెళ్లి ఆపడానికి ఎలాంటి ప్రయత్నాలు చెయ్యవద్దని భవాని చెప్తుంది. పసుపు దంచి పెళ్లి పనులు స్టార్ట్ చెయ్యాలని సుమలత అంటుంది. ఆ తర్వాత నేను పెళ్లి ఆపడానికి ఏదైనా ప్రయత్నం చేస్తానని మీకు అనుమానం ఉండొచ్చు. నేను మీ కళ్ల ముందే ఉంటే మీకు ఎలాంటి అనుమానం ఉండదు కదా, అందుకే నేను పసుపు దంచే దగ్గరికి వస్తానని కృష్ణ అనగానే భవాని ఒప్పుకుంటుంది. ఆ తర్వాత శకుంతల జరుగుతున్న విషయాల గురించి కృష్ణకి చెప్తూ బాధపడుతుంది. మరొక వైపు కృష్ణ గురించి నందు ఆలోచిస్తుంటుంది. అప్పుడే నందు దగ్గరికి గౌతమ్ వచ్చి.. భవానిపై కోపంగా ఉంటాడు. మీ అమ్మా ఏం చేసిందో తెలుసా? మొదటి పెళ్ళి కార్డు తీసుకొని వెళ్లి కృష్ణకే ఇచ్చిందని చెప్పగానే నందు షాక్ అవుతుంది.
మరొకవైపు రేవతి, నందు, మధు కలిసి కృష్ణ గురించి మాట్లాడుకుంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన భవాని అన్ని సిద్ధం చేసావా అని రేవతిని అడుగుతుంది. ఆ తర్వాత మొదటి కార్డు ఎవరికి ఇచ్చావ్ అక్క అని భవానిని రేవతి అడుగుతుంది. నాకే ఇచ్చారంటూ కృష్ణ వస్తుంది. ఆ తర్వాత నువ్వేంటి కృష్ణ ఇక్కడ అని మురారి అడుగుతాడు. మేడమ్ హెల్ప్ చెయ్యడానికి రమ్మని పిలిస్తే వచ్చానని చెప్తుంది. ఆ తర్వాత కృష్ణ పసుపు ఎందుకు దంచుతారని అందరికి వివరంగా చెప్తుంది. దాని తర్వాత కృష్ణ అందరికి గంధం పూస్తూ ఉంటుంది. తరువాయి భాగంలో కృష్ణకి పెళ్లి అయిన విషయాన్ని భవాని చెప్పకనే చెప్తుంది. అది విన్న మురారి.. కృష్ణకి పెళ్లి అయిందా అని షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.