English | Telugu
Priyanka Jain Eliminated : ప్రియాంక జైన్ ఎలిమినేటెడ్!
Updated : Dec 17, 2023
బిగ్ బాస్ సీజన్-7 లో గ్రాంఢ్ ఫినాలే రోజు రానే వచ్చేసింది. హౌస్ లో శనివారం ఎవరి ఎలిమినేషన్ చూపించలేదు. అయితే హౌస్ లో శనివారమే గ్రాంఢ్ ఫినాలే షూట్ మొదలైందని ఆరుగురిలో నలుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారని తెలుస్తుంది. ఇందులో ఓటింగ్ ప్రకారం పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్ దీప్ టాప్-3 లో ఉండగా.. అంబటి అర్జున్, యావర్, ప్రియాంక బాటమ్-3 లో ఉన్నారు. అయితే వీరిలో అందరికంటే లీస్ట్ లో ఉన్న అంబటి అర్జున్ ఆరవ స్థానంలో హౌస్ నుండి ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది.
ఇక ప్రియాంక జైన్ ఐదవ స్థానంలో ఎలిమినేట్ అయిందని బయట టాక్ వినిపిస్తుంది. హీరో రవితేజ.. ఈగల్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా బిగ్ బాస్ స్టేజ్ మీదికి వచ్చాడు. అయితే ప్రియాంక జైన్ ఎలిమినేషన్ ప్రక్రియని రవితేజకి ఇచ్చాడు నాగార్జున. హౌస్ లో నుంచి ప్రియాంకని ఎలిమినేట్ చేసి స్టేజ్ మీదికి రవితేజ తీసుకొచ్చాడంట. ఇక అయిదవ స్థానంలో ఎలిమినేట్ అయిన ప్రియాంక జైన్‌కి రూ.10 లక్షల సూట్ కేస్ ఆఫర్ చేశారు బిగ్ బాస్. అయితే ఆ సూట్ కేస్ ఆఫర్‌ని తిరస్కరించిన ప్రియాంక.. ఐదవ స్థానంలో ఎలిమినేట్ అయ్యింది. ఈ పదిహేను వారాల జర్నీలో ప్రియాంక జైన్, శోభాశెట్టి, అమర్ దీప్ లు కలిసి గ్రూప్ గా ఉండి ఆడటం వల్ల వీరికి సీరియల్ బ్యాచ్ అని ముద్రపడింది. దాంతో వీళ్ళు ముగ్గురు ఏం చేసినా ఆడియన్స్ లో ఒక నెగెటివ్ ఇంపాక్ట్ పడింది.
కిచెన్ లో ఎక్కువ సేపు గడపటం వల్ల ప్రియాంకకి పెద్దగా స్క్రీన్ స్పేస్ లభించలేదనేది వాస్తవం. సీరియల్ బ్యాచ్‌లో ఉండటం.. దానికి తోడు శివాజీ గారి గురించి బ్యాక్ బిచ్చింగ్ చేయడం ప్రియాంకకి పెద్ద మైనస్ అయ్యింది. ఇక నామినేషన్స్‌లో భోలే షావలితో థూ.. ఛీ అంటూ దారుణంగా ప్రవర్తించడం కూడా ప్రియాంకపై నెగెటివ్ ఇంపాక్ట్ మరింత పెరిగింది. శోభాశెట్టిపై దారుణంగా నెగెటివిటి ఉండటం వల్ల ప్రియాంక లాస్ట్ వీక్ వరకు ఉంది కానీ లేదంటే గతవారమే బయటకు వచ్చేసేది. కాగా ఇప్పటి వరకూ బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఫీమేల్ కంటెస్టెంట్ విన్నర్ అయ్యింది లేదు.