English | Telugu

ఇనయా అందాల ఆరబోత.. ఇన్ స్టాగ్రామ్ లో వైరల్!

సోషల్ మీడియాలో అరకొరా డ్రెస్ లతో, బికినీ ఫోటోలతో కనిపించే తారలకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. నిన్న మొన్నటి దాకా అనసూయ చీరకట్టులో సెగపుట్టించగా, అరియానా గ్లోరీ బికినీలో కుర్రాళ్ళ మతిపోగొట్టింది. ఇప్పుడు ఆ జాబితాలోకి ఇనయా సుల్తానా చేరింది. అందాల ఆరబోతలో నేనేం తక్కువ కాదన్నట్టుగా రెచ్చిపోయింది ఇనయా.

బిగ్ బాస్ సీజన్-6 లో మోస్ట్ డేర్ అండ్ డెవిల్ గా పేరుతెచ్చుకుంది ఇనయా ముజిబుర్ సుల్తానా అలియాస్ ఇనయా సుల్తానా. బిగ్ బాస్ సీజన్-6 లో తనకన్నా స్ట్రాంగ్ ఉన్న రేవంత్, శ్రీహన్ వంటి కంటెస్టెంట్స్ తో ఆడి అప్పట్లో ప్రేక్షకులే కాదు విమర్శకుల ప్రశంసలు పొందింది ఇనయా. బిగ్ బాస్ లో ఉన్నంతవరకు టాస్క్ లలో ఆడపులిలా ఆడిన ఇనయా సుల్తానా.. బయటకు వచ్చేసరికి తనకంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకొని, ఎవరూ ఊహించని క్రేజ్ ని సంపాదించుకుంది. బిగ్ బాస్ కి ముందు ఆర్జీవీతో డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ కావడంతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకుంది ఇనయా. దాంతో బిగ్ బాస్ లో అవకాశం కొట్టేసి ఫేమస్ అయింది. హాట్ డ్రెస్ తో క్లివేజ్ షో చేస్తు ఇనయా తాజాగా షేర్ చేసిన పిక్స్ కి ఫ్లాట్ అవ్వని వారు లేరు. ముఖ్యంగా యూత్ అయితే మత్తుగా ఉండే తన కళ్ళకి తోడు ఇనయా ఇంకొంచం మత్తుగా ఫేస్ పెట్టేసరికి ఆమె అందానికి ఫిదా అవుతున్నారు.

బిగ్ బాస్ ద్వారా బాగా పాపులర్ అయిన బ్యూటీల్లో ఇనయా సుల్తానా ఒకరు. ఈ షో పుణ్యమా అని ఇనయాకి డిమాండ్ బాగానే పెరిగింది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు యాడ్స్‌లో కూడా చేస్తూ బాగానే సంపాదించుకుంటుంది. మొన్నటిదాకా విదేశీ టూర్ లతో బిజీగా ఉన్నా ఇనయా సుల్తానా తాజాగా ఇండియాకి వచ్చింది. ఇక వచ్చీ రాగానే ఒక ఫోటోషూట్ చేసింది. ఇందులో చీరకట్టులో కనిపించిన ఇనయా.. ఎద అందాలు చూపిస్తూ కుర్రాళ్ళ మతిపోగుడుతుంది.‌ అయితే ఈ ఫోటో షూట్ ని ఇనయా త‌న ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా ఆ పోస్ట్ కి భారీగా స్పందన లభిస్తుంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.