English | Telugu

Guppedantha Manasu : శైలేంద్ర కపటధారి.. ఆ విషయం ధరణి తెలుసుకుంటుందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్‌ -948 లో.. శైలేంద్రపై ఉన్న కోపంతో‌ మహేంద్ర గన్ తో షూట్ చెయ్యాలని అనుకొని శైలేంద్ర దగ్గరికి వస్తాడు. రిషి ఎక్కడ ఉన్నాడో చెప్పమని‌ మహేంద్ర అడుగుతాడు. నాకు తెలియదని శైలేంద్ర అనగానే.. మహేంద్రకి ఇంకా కోపం వస్తుంది. ధరణి దేవయాని ఇద్దరు అడ్డు వచ్చినా వాళ్ళని షూట్ చేయబోతాడు. కానీ అనుపమ, వసుధార ఇద్దరు వస్తారు. అది చూసి మహేంద్ర చెయ్యి పట్టుకొని అనుపమ ఆపుతుంది.

ఆ తర్వాత నన్ను ఆపకండి అని మహేంద్ర గట్టిగా అరుస్తు ఉంటాడు. అయినా వినకుండా అనుపమ, వసుధార ఇద్దరు మహేంద్రని బయటకు తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత హమ్మయ్య బ్రతికి పోయానని శైలేంద్ర అనుకుంటాడు. నీకేం కాలేదు కదా అంటూ శైలేంద్ర గురించి అడిగి తెలుసుకుంటుంది దేవయాని. మరొకవైపు మహేంద్ర వాళ్ళు బయటకు వెళ్ళగానే.. అప్పుడే ఫణీంద్ర వస్తాడు. తనని చూసి మహేంద్ర ఎమోషనల్ అయి హగ్ చేసుకుంటాడు. ఏం బాధపడకు రిషి వస్తాడని ఫణీంద్ర చెప్తాడు. ఫణింద్ర మాట విన్న శైలేంద్ర బయటకు వచ్చి.. నేను అదే చెప్తున్నా రిషి క్షేమంగా ఉంటాడు. నువ్వు ఏం బాధపడకు. నేను వెతికి తీసుకొని వస్తానని చెప్తున్నా అని శైలేంద్ర నటిస్తుంటాడు. కానీ శైలేంద్ర గురించి ఒక్క మాట కూడా మహేంద్ర తన అన్నయ్యకి చెప్పడు. మహేంద్ర వాళ్ళు వెళ్ళిపోతారు. ఫణింద్ర లోపలికి వెళ్లగానే చిందరవందరగా ఉన్న ఇల్లు చూసి ఏమైంది అని అడుగుతాడు. దేవయాని ఏదో కవర్ చెయబోతుఉంటే. నువ్వు ఆగు.. ధరణి ఏం జరిగింది? ఎవరికీ బయపడకని ఫణింద్ర అనగానే.. ధరణి జరిగింది మొత్తం ఫణింద్రకి చెప్తుంది. మరి నువ్వు ఎందుకు అబద్ధం చెప్పబోయావని దేవయానిపై ఫణీంద్ర కోప్పడతాడు.

ఆ తర్వాత మహేంద్రకి ఇంత బాధ, కోపం వచ్చిందంటే అతనికి ఎక్కడో శైలేంద్రపై డౌట్ వచ్చింది. ఎందుకు శైలేంద్రపై డౌట్ వచ్చింది? ఏం చేశారని ఫణింద్ర అడుగుతాడు. ఏం లేదంటూ దేవాయని అంటుంది. ఇక్కడే ఉంటే అంతా బయటపడేలా ఉందని శైలేంద్ర నొప్పి అంటు లోపలికి వెళ్తాడు. అ తర్వాత ధరణిని పిలిచి కూల్ చెయ్యాలని‌‌ శైలేంద్ర చూస్తాడు. నేను మారిపోయాను. నీకు రిషి ఎక్కడ ఉన్నాడో తెలిస్తే నాకు చెప్పని శైలేంద్ర యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.