English | Telugu

Prince Yawar Eliminated: ప్రిన్స్ యావర్ ఎలిమినేటెడ్.. అయినా జాక్ పాట్ కొట్టాడు!

బిగ్ బాస్ సీజన్-7 ముగింపుకు వచ్చేసింది. చివరి వారంలో హౌస్ లో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. ఆదివారం టీవీలో ప్రసారమయ్యే గ్రాంఢ్ ఫినాలే ఎపిసోడ్ దాదాపు మూడున్నర గంటల పాటు సాగుతుంది. అయితే ఈ షూటింగ్ శనివారమే మొదలవుతుంది. ఈ క్రమంలో గ్రాంఢ్ ఫినాలేలో జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది.

ఆరవ స్థానంలో అంబటి అర్జున్ ఎలిమినేషన్ అయ్యాడని, ఐదవ స్థానంలో ప్రియాంక ఎలిమినేట్ అయిందని తెలుస్తుంది. ఇక ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం నాల్గవ స్థానంలో ఉన్న యావర్ ఎలిమినేట్ అయ్యాడని తెలుస్తుంది.

మొదట ప్రియాంక, అర్జున్ ఇద్దరికి.. 10 లక్షల సూట్ కేస్ బిగ్ బాస్ ఆఫర్ చేయగా వాళ్లు తిరస్కరించారు. దాంతో ఖాళీచేతులతో ప్రియాంక ఎలిమినేట్ అయిందట. ఆ తర్వాత ప్రిన్స్ యావర్ తెలివిగా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడు. ప్రశాంత్, అమర్, శివాజీ, యావర్.. ఈ నలుగురు హౌస్‌లో ఉన్నారు. అప్పుడే బిగ్ బాస్ 15 లక్షల సూట్ కేసు ఆఫర్ చేయడంతో యావర్ సూట్ కేసు తీసుకుని నాలుగో స్థానంలో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు యావర్ సూట్ కేస్ తీసుకోవడం ద్వారా.. అతను పడ్డ కష్టానికి ఫలితం దక్కినట్టే అయ్యింది.

యావర్ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చేముందు తను జాబ్ చేసేవాడిని కాదని, తన అన్నయ్యల మీదే ఆధారపడి ఉన్నానని చాలా సందర్భాలలో చెప్పాడు. హౌస్ లోకి వచ్చేముందు రూపాయి కూడా అకౌంట్ లో లేదని శివాజీతో యావర్ చెప్పుకొని ఏడ్వడంతో చాలామంది ప్రేక్షకులు అతనికి కనెక్ట్ అయ్యారు. అయితే ఇది యావర్ ను విన్నర్ గా నిలబెట్టేందుకు దోహదపడలేదని వాస్తవం. ఈ విషయం గ్రహించిన యావర్ తనకి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. మనీ తీసుకున్న ఎలిమినేషనే, తీసుకోకపోయిన ఎలిమినేషనే అని గ్రహించిన యావర్ 15 లక్షల సూటు కేసు తీసుకొని బయటకొచ్చాడంట. మరి స్పై బ్యాచ్ లో మోస్ట్ స్ట్రాంగ్ గా ఉన్న యావర్ ఎలిమినేషన్ అవ్వడంతో స్పై బ్యాచ్ అభిమానులు కాస్త నిరాశలో ఉన్నారని తెలుస్తోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.