English | Telugu
Ambati Arjun Eliminated: అంబటి అర్జున్ ఎలిమినేటెడ్!
Updated : Dec 16, 2023
బిగ్ బాస్ సీజన్-7 గ్రాంఢ్ ఫినాలేకి అడుగుదూరంలో ఉంది. హౌస్ లో శివాజీ, పల్లవి ప్రశాంత్, ప్రియాంక, అమర్ దీప్, యావర్, అంబటి అర్జున్ ఫైనలిస్ట్ లుగా ఉన్నారు. అయితే శుక్రవారం హౌస్ లోకి శ్రీముఖి వచ్చి, హౌస్ మేట్స్ తో కలిసి ఆడింది. బిగ్ బాస్ సూట్ కేస్ ఆఫర్ చేసిందంతా శనివారం నాటి ఎపిసోడ్ లో టీవీలో ప్రసారం చేసాడు బిగ్ బాస్. ఇక గ్రాంఢ్ ఫినాలే షూట్ హౌస్ లో శనివారమే మొదలైంది. ఇందులో కొన్ని షాకింగ్ ఎలిమినేషన్లు జరిగినట్టుగా తెలుస్తుంది.
సీజన్-7 లో 2.0 గా గ్రాంఢ్ వెల్ కమ్ ఇచ్చిన అయిదుగురు కంటెస్టెంట్స్.. నయని పావని, పూజామూర్తి, అశ్వినిశ్రీ, భోలే షావలి, అంబటి అర్జున్. అయితే వీరిలో నుండి వచ్చిన మొదటివారమే నయని పావని ఎలిమినేషన్ అవ్వగా ఆ తర్వాత వారం పూజామూర్తి ఎలిమినేషన్ అయింది. ఇక ఆ తర్వాత అశ్వినిశ్రీ, భోలే షావలి ఎలిమినేషన్ అవ్వగా.. అంబటి అర్జున్ ఒక్కడే గ్రాంఢ్ ఫినాలే వీక్ వరకు ఉన్నాడు. ఇక హౌస్ లో పవరస్త్ర కోసం జరిగిన టాస్క్ లలో అదరగొట్టి మొదటి ఫైనలిస్ట్ గా అంబటి అర్జున్ నిలిచిన విషయం తెలిసిందే. ఇలా అంబటి అర్జున్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అందరికి తెలిసేసరికే ఆట ముగిసింది. కారణం.. ఐదో వారంలో అర్జున్ వెళ్లడమే మైనస్ అయ్యింది. అదే ముందు నుంచి వెళ్లి ఉంటే అతని ఓటింగ్ గ్రాఫ్ మరో రేంజ్‌లో ఉండేది. ఇక ఫినాలే అస్త్ర గెలుచుకోవడం ద్వారా అతను ఫైనలిస్ట్‌గా నిలిచాడు కాబట్టి హౌస్‌లో ఉన్నాడు కానీ.. లేదంటే అర్జున్ కే లీస్ట్ ఓటింగ్ వచ్చిందని స్వయంగా నాగార్జునే చెప్పడం కూడా అర్జున్‌కి మైనస్ అయ్యింది.
నిన్న అనగా శనివారం ఉదయం హౌస్ లో గ్రాంఢ్ ఫినాలే షూటింగ్ మొదలైందని తెలుస్తోంది. ఆరుగురు హౌస్ మేట్స్ లలో ఎవరైతే బాటమ్-3 లో ఉన్నారో వారిని ఎలిమినేషన్ చేసినట్టుగా తెలుస్తుంది. మొదటి ఎలిమినేషన్ గా.. ఓటింగ్ ప్రకారం లీస్ట్ లో ఉన్న అంబటి అర్జున్ ఎలిమినేట్ అయ్యాడు. టికెట్ టు ఫినాలే గెలిచి అర్జున్ మొదటి ఫైనలిస్ట్ అయ్యాడు కాబట్టి అతను హౌస్ లో చివరి వరకు ఉన్నాడు కానీ గత వారమే ఎలిమినేట్ అవ్వాల్సింది ఎందుకంటే అతనికి ప్రేక్షకుల ఓటింగ్ పెద్దగా ఏమీ లేదు. ఇక ఇప్పటి వరకు ఏ సీజన్ లోను టికెట్ టు ఫినాలే గెలిచిన వారికి టైటిల్ లభించలేదనది వాస్తవం. టాప్-6 నుండి ఆరవ స్థానంలో అంబటి అర్జున్ ఎలిమినేషన్ అయ్యాడని తెలుస్తుంది.