English | Telugu

Krishna Mukunda Murari:గతం గుర్తుకురాగానే ఫుల్ ఫామ్ లోకి వచ్చిన మురారి.. నిజమేంటో నిరూపించగలడా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -341 లో.. మురారికి గతం గుర్తుకు రావడం తట్టుకోలేని ముకుంద సూసైడ్ ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత కృష్ణ , గౌతమ్ ఇద్దరు ముకుందకి ట్రీట్ మెంట్ చేస్తారు. ఆ తర్వాత కృష్ణ తప్పు చెయ్యలేదని మురారి నిరూపిస్తానని భవానికి ఛాలెంజ్ చేస్తాడు. ఆ తర్వాత కృష్ణ అవుట్ హౌస్ లో ఉన్న కూడా ఈ ఇంటికి ఎప్పుడు పడితే అప్పుడు రావచ్చు పోవచ్చని మురారి చెప్తాడు.

మరొకవైపు కృష్ణ వెళ్తుంటే రేవతి పిలుస్తుంది. మురారికి ఎలా గతం గుర్తుకు వచ్చిందో కృష్ణ చెప్తుంది. నా దగ్గరికి వచ్చి నీ భర్త ఎవరని అడిగేవారు. దాంతో మీకు గతం గుర్తుకు వస్తే నా భర్త ఎవరో తెలుస్తుందని అనగానే.. తన గతం గుర్తుకు తెచ్చుకోనే ప్రయత్నం చేశారు. ఇక నేను కోనేటిలో పడగానే.. ఏసీపీ సర్ కి గతం గుర్తుకు వచ్చిందని రేవతికి కృష్ణ చెప్తుంది. మరొకవైపు శకుంతల కృష్ణ జీవితం బాగవుతున్నందుకు దేవుడికి మొక్కుకుంటుంది. ఆ తర్వాత అక్కడికి మురారి వచ్చి వాళ్ళకి ధైర్యం చెప్తాడు. తప్పు చేసిన వాళ్లని పట్టుకుంటానని వాళ్ళకి చెప్పగానే.. కృష్ణ శకుంతల హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత కృష్ణపై‌ మురారి కోపంగా ఉంటాడు. అసలు ఇన్ని రోజులు నువ్వే నా భార్య అని ఎందుకు చెప్పలేదని‌ మురారి అడుగుతాడు. పెద్ద అత్తయ్య గారంటే ఇంట్లో ఎంత గౌరవం తెలుసు కదా అందుకే చెప్పలేదని కృష్ణ చెప్తుంది. ఆ తర్వాత కృష్ణ జరిగింది మొత్తం మురారికి చెప్తుంది. అందులో తన తప్పేం లేదంటు మురారికి క్లారిటి ఇస్తుంది కృష్ణ. ఆ తర్వాత కృష్ణ చెంపపై మురారి ముద్దు పెడతాడు.

మరొకవైపు భవాని తను తీసుకున్న నిర్ణయంపై ఆలోచనలో పడుతుంది. తను తీసుకున్న నిర్ణయం సరైనదేనని తన అంతరాత్మ చెప్తుంది. మరొకవైపు ముకుంద నిద్రలో నుండి లేచి కృష్ణని చూసి కోపంగా ఎందుకు బతికించావని అనగానే.. నువ్వు ముందు టాబ్లెట్స్ వేసుకోనని కృష్ణ అంటుంది. తరువాయి భాగంలో.. ఇక నేను డ్యూటీలో జాయిన్ అవుతానని భవాని దగ్గర మురారి ఆశీర్వాదం తీసుకొని.. కృష్ణ వాళ్ళ చిన్నాన్న ఏ తప్పు చెయ్యలేదని నిరూపించాలి. అందుకే వాళ్ళ చిన్నన్నని ఆ తర్వాత హాస్పిటల్ లో డాక్టర్ ని కలవాలని అనగానే.. ఎక్కడ తన అన్నయ్య గురించి బయట పడుతుందోనని ముకుంద టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.