English | Telugu

సలార్ మూవీని రెండు సార్లు చూడాలి...ఫస్ట్ టైం అర్ధం కాదు!

ఇప్పుడు ఎటు చూసిన సలార్ మూవీ ఫీవర్ తో జనం ఊగిపోతున్నారు. ఈ మూవీని  చూసిన ప్రతీ ఒక్కరూ కూడా ఫ్రూట్ సలాడ్ అంత టేస్టీ రివ్యూస్ ని ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు అమ్మడు గీతూ రాయల్ కూడా ఈ సలార్ బెనిఫిట్ షోకి వెళ్లి దాని గురించి కొన్ని పాయింట్స్ చెప్తూ ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసుకుంది. ఈ మూవీ మంచి సక్సెస్ కావడంతో ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.  గీతూ ఈ మూవీ గురించి చెప్తూ "ఫస్ట్ టైం చూస్తే ఈ సినిమా ఎవరికీ అర్ధం కాదు. ముందు ఈ మూవీ నేను ఫ్లాప్ అవుతుందని అనుకున్నాను.. ప్రభాస్ నటించిన ఈ  సినిమా కూడా ఫ్లాపేనా అని ఫీల్ అయ్యాను.