English | Telugu

Guppedantha Manasu:కొడుకు జాడ చెప్పమంటు షూట్ చేసిన ఆ తండ్రి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -947 లో.. అనుపమ ఎక్కడికో వెళ్తు ఒంటరిగా ఉన్న మహేంద్రని చూసి ఆగి మాట్లాడుతుంది. ఏమైంది ఇక్కడ ఉన్నావని మహేంద్రని అనుపమ అడుగుతుంది. ఏం లేదు. శైలేంద్ర వల్లే ఇదంతా అని తెలిసి కూడా ఏం చెయ్యలేకపోతున్నానని మహేంద్ర బాధపడుతుంటే.. రిషికి ఏం కాదంటు అనుపమ మహేంద్రకి చెప్తుంది.

ఆ తర్వాత నువ్వు నాకొక మాట ఇస్తావా అని అనుపమతో మహేంద్ర అంటాడు. ఏంటి అదని అనుపమ అడుగుతుంది. వసుధార బాధ్యతలు నువ్వు తీసుకుంటావా అని మహేంద్ర అనగానే.. మామయ్యవి నువ్వు ఉండగా నేను తీసుకోవడమేంటని అనుపమ డౌట్ గా అడుగుతుంది. ఏం లేదని మహేంద్ర అంటూ నేను ఏదైనా కరెక్ట్ చేస్తాను కదా.. నేను ఏం చేసిన నువ్వు నాకు సపోర్ట్ చేస్తావా అని మహేంద్ర అంటాడు. చేస్తాను కానీ నువ్వు ఇప్పుడేం చెయ్యాబోతున్నావని అనుపమ అడుగుతుంది. కానీ మహేంద్ర ఏం చెప్పడు. ఆ తర్వాత అనుపమ వెళ్తుంటే వసుధార జాగ్రత్త అని చెప్తాడు. ఏంటి ఎందుకు చెప్తున్నావని అనుపమ మళ్ళీ అడుగుతుంది. ఏం లేదు నువ్వు వెళ్లి, నీ పని చూసుకో అని అనుపమని మహేంద్ర పంపిస్తాడు. మరొకవైపు కాబోయే ఎండీని నేనే ఇక నేను ఆడిందే అట.. పాడిందే పాట అని శైలేంద్ర సంబరపడిపోతుంటే అప్పుడే మహేంద్ర వచ్చి.. రిషి ఎక్కడ ఉన్నాడో చెప్పమని అడుగుతాడు. నాకు తెలియదంటూ శైలేంద్ర బయపడతాడు.

ఆ తర్వాత మహేంద్ర రీవాల్వర్ తీసి షూట్ చేస్తానని అనగానే.. శైలేంద్ర భయంతో మమ్మీ అంటు అరుస్తుంటే దేవయాని, ధరణి వస్తారు. దేవాయని వద్దు మహేంద్ర అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. ధరణి నువ్వు అయిన కాపాడు‌ అని శైలేంద్ర అనగానే.. మరి రిషి ఎక్కడ ఉన్నాడో చెప్పండని ధరణి అంటుంది. ఇప్పుడు శైలేంద్రని షూట్ చేస్తే మహేంద్ర జైల్ కి వెళ్తాడని దేవయాని అనగానే.. అవును కదా అని ధరణి వెంటనే వసుధారకి ఫోన్ చేసి చెప్తుంది. ఆ తర్వాత మహేంద్రకి వసుధార ఫోన్ చేసి.. మామయ్య గొడవ జరుగుతుందని అనగానే శైలేంద్ర ని షూట్ చేస్తున్నానంటు చెప్పి‌ మహేంద్ర ఫోన్ కట్ చేస్తాడు. దాంతో వసుధార ఎలాగైనా ఆపాలి అంటూ కంగారుగా బయలుదేరుతుంది. మరొకవైపు మహేంద్రని నెట్టి‌ శైలేంద్ర డోర్ తీసుకొని బయటకు వస్తాడు. అయిన మహేంద్ర వదలకుండా శైలేంద్ర వెనకాల వస్తాడు. ధరణి, దేవాయనిలని నెట్టి మరి శైలేంద్రని మహేంద్ర షూట్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.