English | Telugu
అమర్ దీప్ ఎలిమినేటెడ్.. ఉల్టా పుల్టా ట్విస్ట్ మామూలుగా లేదుగా!
Updated : Dec 16, 2023
ఇదేందయ్యా ఇది.. గ్రాంఢ్ ఫినాలే పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ ల మధ్య అని అన్నారు. అప్పుడే అమర్ దీప్ ఎలిమినేషన్ ఏంటి?.. ఇలా సీజన్-7 మొత్తం ఉల్టా పుల్టా ట్విస్ట్ లతో అదరగొడుతున్నాడు బిగ్ బాస్.
ఇక గ్రాంఢ్ పినాలేలో నిన్నటి శనివారం నాటి ఎపిసోడ్ లో హౌస్ లోకి శ్రీముఖి వచ్చింది. హౌస్ మేట్స్ తో అంత్యాక్షరీ అంటు పాటలు పాడిస్తూ డ్యాన్స్ లు చేసింది. ఆ తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చేత ఒక ఫన్ టాస్క్ ఆడించాడు. కళ్ళకి గంతలు కట్టుకుని, తలకి హెల్మెట్ పెట్టుకొని కుర్చీలో కూర్చోవాలన్నాడు. అలా కూర్చొన్న కంటెస్టెంట్ ని డూప్లికేట్ కర్రలతో మిగిలిన కంటెస్టెంట్ కొట్టాలని బిగ్ బాస్ చెప్పాడు. అలా అమర్ దీప్ ని హౌస్ మేట్స్ అంతా ఒక ఆట ఆడుకున్నారు. కాసేపటిక యావర్ కోసం ఫుడ్ పంపించారు బిగ్ బాస్. ఇక హోమ్ ఫుడ్ రాని ప్రియాంకకి కూడా ఇంటి భోజనం పంపించాడు బిగ్ బాస్. ఇక హౌస్ లో సూట్ కేసుల లావాదేవీలు జరిపాడు బిగ్ బాస్. మూడు లక్షలు, ఎనిమిది లక్షల సూట్ కేసులు కావాలా అని బిగ్ బాస్ పంపించాడు. అయితే హౌస్ లోని ఏ కంటెస్టెంట్ ఆ సూట్ కేసులు తీసుకోలేదు.
ఇక హౌస్ లో ఉన్నవారిలో ప్రియాంక, అర్జున్ ఎలిమినేట్ అయ్యారని తెలుస్తుంది. మరోవైపు నాల్గవ స్థానంలో ప్రిన్స్ యావర్ పదిహేను లక్షల సూట్ కేస్ తీసుకొని ఎలిమినేట్ అయ్యినట్టు తెలుస్తోంది. అమర్ దీప్, శివాజీ, పల్లవి ప్రశాంత్ ముగ్గురు టాప్-3 లో ఉండగా.. అమర్ దీప్ ఎలిమినేట్ అయి బయటకొచ్చాడని.. పల్లవి ప్రశాంత్, శివాజీల మధ్య గ్రాంఢ్ ఫినాలే రేస్ జరుగుబోతుందని నెట్టింట వార్తలు వస్తున్నాయి. అయితే పల్లవి ప్రశాంత్ విన్నరా లేక శివాజీ విన్నరా? అని ఫినాలేలో తెలుస్తుంది. అయితే అమర్ దీప్ ఎలిమినేట్ అవ్వడంతో తన సీరియల్ అభిమానులు తెగ ఫీల్ అవుతూ, బాధతో పోస్ట్ లు చేస్తున్నారు.