English | Telugu
విష్ణుప్రియ బాయ్ ఫ్రెండ్ ని కలిసిన రీతూ చౌదరి!
Updated : Jan 4, 2024
ఇదేందయ్యా ఇది.. యాంకర్ విష్ణుప్రియకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? తనని రీతూ చౌదరి కలిసిందా? ఇదెప్పుడు జరిగిందని అనుకుంటున్నారా.. ఏది నిజమో తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే తాజాగా రీతు చౌదరి తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసిన వ్లాగ్ ని చూడాల్సిందే. రీతు చౌదరి విష్ణుప్రియ కోసం ప్యారిస్ వెళ్ళింది. అదంతా ఓ వ్లాగ్ లో షేర్ చేసుకుంది రీతూ.
రీతూ చౌదరి.. ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న నటి. రీతూ తన కెరీర్ ని ఒక మ్యూజిక్ ఛానెల్ లో యాంకర్ గా మొదలు పెట్టింది. అంతేకాకుండా యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా చేసిన పెళ్లి చూపులు షోకి వచ్చి మంచి ఫేమ్ ని సంపాదించుకుంది. ప్రస్తుతం రీతూ జబర్దస్త్ లో చేస్తోంది. అంతేకాకుండా 'ఇంటిగుట్టు' సీరియల్ లో నెగెటివ్ రోల్ లో యాక్టింగ్ చేసి అందరిని మెప్పించిన విషయం తెలిసిందే. అప్పట్లో యాంకర్ విష్ణుప్రియ, రీతూ కలిసి బ్యాంకాక్ బీచ్ లో సందడి చేసిన ఫోటోస్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. రీతూ చౌదరి వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత తనకి విపరీతమైన సింపతీ లభించింది. ఆ తర్వాత పలు అవకాశాలు కూడా వచ్చాయి. అయితే ఒకవైపు 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో, మరొక వైపు జబర్దస్త్ షోలో నటిస్తూ బిజీగా ఉంటోంది రీతూ. అయితే తను సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ ని కూడా స్టార్ట్ చేసింది.
ఫోటోషూట్ లతో ఇన్‌స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉంటూ, ఎప్పుడూ తన అభిమానులకు దగ్గరగా ఉంటోంది. అయితే ఎప్పుడు హాట్ అండ్ బోల్డ్ ఫోటోలు ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసే రీతూ.. తన ఫ్రెండ్ విష్ణుప్రియని కలవడానాకి ప్యారిస్ కి వెళ్లింది. అక్కడ ప్యారిస్ లో బోట్ లో వెళ్తూ కబుర్లు చెప్పింది. అయితే అక్కడ ప్యారిస్ వీధుల్లో షాపింగ్ చేసి కొత్తగా కొన్న డ్రెస్ లని వేసుకొని కనువిందు చేశారు. " ఫైనల్లీ విష్ణుప్రియ బాయ్ ఫ్రెండ్ ని కలిసాను" అని ఈ వ్లాగ్ కి టైటిల్ కూడా పెట్టేసింది భామ. ఇది చూసి విష్ణుప్రియకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అనే డౌట్ అందరిలో ఉంటుంది. కానీ తనకి బాయ్ ఫ్రెండ్ కాదు.. విష్ణుప్రియనే రీతూకి బాయ్ ఫ్రెండ్ లెక్క అంట.. అంటే తనకు అమ్మాయి అయినా అబ్బాయి అయినా తనే ఫ్రెండ్ అని చెప్పుకొచ్చింది రీతూ. కాగా ఈ వ్లాగ్ ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.