English | Telugu

మానవత్వాన్ని చాటుకున్న నూకరాజు ఆసియా!

సినిమాలపై ఉన్న ఆశతో ఇండస్ట్రీకి వచ్చిన ఓ మధ్యతరగతి అబ్బాయి నూకరాజు. తన కామెడీ టైమింగ్ తో అతి త్వరగా జబర్దస్త్ ద్వారా మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. తను ఉన్నంతలో నలుగురకి సేవ చెయ్యాలని అనుకునే దృక్పధంతో నూకరాజు ఉంటాడు. తన ఆలోచనలకు తగ్గట్టుగానే తన పార్టనర్ గా ఆసియాని ఎంచుకున్నాడు. అయితే తాజాగా నూకరాజు ఆసియా ఇద్దరు కలిసి తమ ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియోని పెట్టారు. హైదరాబాద్ లో‌ బ్రతకడానికి చాలామంది వస్తుంటారు. అందులో కొంతమంది ఒక్కపూట తినడానికి కూడా ఫుడ్ దొరకనివాళ్ళు ఎందరో ఉన్నారు. అలాంటి కష్టాల్లోనే ఉన్న ఒక మహిళ తను కష్టాల్లో ఉండి రాపిడో నడుపుకుంటుంది. తన కష్టం చూడలేని నూకరాజు ఆసియా ఇద్దరు కలిసి కొంత డబ్బులు కలెక్ట్ చేసి ఇచ్చారు. దాంతో ఆ మహిళ వాళ్ళకి థాంక్స్ చెప్పింది.

ఏంజిల్ ఆసియా, నూకరాజు.. జబర్దస్త్ ద్వారా వెలుగులోకి వచ్చారు. తన కామెడీ టైమింగ్ ద్వారా నూకరాజు మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. అయితే నూకరాజు, ఆసియా కలిసి లివింగ్ రిలేషన్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరు కలిసి జబర్దస్త్ స్టేజ్ పై తమ కామెడీ పంచ్ లతో నవ్వులు పూయిస్తున్నారు. పటాస్ షో ద్వారా నూకరాజు, ఆసియా పరిచయమైన విషయం తెలిసిందే. వీరిద్దరు మొదటి నుంచి మంచి స్నేహితులు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.

బుల్లితెరపై జబర్దస్త్ షో ఎంతగా పాపులారిటీ సంపాదించిందో అందరికి తెలిసిందే. అయితే ఈ షోలో తమ కామెడీతో ఆకట్టుకొని సినిమా అవకాశాలు పొందిన వారు చాలానే ఉన్నారు. అయితే ఇప్పుడు జబర్దస్త్ లోకి కొత్త టీమ్స్ వచ్చేసాయి. అందులో నూకరాజు, ఇమాన్యుయల్, పాగల్ పవిత్ర, వర్ష, ఆసియా లాంటి వాళ్ళు తమ కామెడీతో రాణిస్తున్నారు. అయితే జబర్దస్త్ కి సాదాసీదా ఆర్టిస్ట్ గా వచ్చిన నూకరాజు.. అన్నిరకాల హావభావాలు పండిస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఆసియా, నూకరాజు కలిసి జబర్దస్త్ స్టేజ్ మీద సూపర్ హిట్ స్కిట్స్ చేస్తూ ప్రేక్షకుల నుండి ప్రశంసలు పొందుతున్నారు. జబర్దస్త్ ప్రోమో కింద కామెంట్లలో కూడా వీరిద్దరి కామెడీ సూపర్ అంటూ ఫ్యాన్స్ చెప్తున్నారు. నూకరాజు, ఆసియా కలిసి ఏ రేంజ్ లో తమ కామెడీతో ఆకట్టుకుంటున్నారో దీన్ని బట్టి తెలుస్తుంది. అయితే నూకరాజుకి కొన్ని ఫోక్ సాంగ్స్ పాడి ఈ మధ్య మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వీళ్ళు తమ ఛానెల్ లో చేసే వ్లాగ్స్ ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటాయి. కాగా ఇప్పుడు నూకరాజు, ఆసియా చేసిన సాయానికి నెటిజన్లు పాజిటివ్ కామెంట్లు చేస్తున్నారు. మానవత్వాన్ని చాటుకున్నారు.. మీరు గ్రేట్, సూపర్ అంటు నెటిజన్లు కామెంట్లతో తమ అభినందనలు తెలుపుతున్నారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.