English | Telugu

Krishna Mukunda Murari:తెల్లారితే నలుగు పెట్టాలి.. ఆ రింగ్ ని చూసేసారు కదా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -357 లో.. కృష్ణ తప్పు చెయ్యలేదని చెప్పడానికి మురారీనే ఇదంతా చేస్తున్నాడని భవాని అంటుంది. ఎక్కడైనా అనుమానం ఉన్న వాళ్ళని అదుపులోకి తీసుకుంటారని భవాని అనగానే.. అనుమానం రావలిసింది నాకు. అంటే పోలీస్ లకి.. మీకు కాదని మురారి అంటాడు. రెండు రోజుల్లో నా భార్యని కాదని వేరేవాళ్ళని పెళ్లి చేసుకోవాలి. నాకు ఇంకా గుర్తు ఉంది మీరు అర్థం చేసుకోండని మురారి అంటాడు. ఎవరి నమ్మకం వాళ్ళది అని భవాని అంటుంది.

మరొకవైపు కృష్ణ దగ్గరకి మురారి వస్తాడు. మురారి టెన్షన్ పడుతుంటే కృష్ణ ఇడ్లీ కారం చేస్తుంటుంది. ఏంటి నేను ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వు ఇలా ఇడ్లీ కారం చేసుకుంటున్నావా అని మురారి అంటాడు. అ తర్వాత నాకు ఒక డౌట్.. ఇదంతా ముకుంద చేపిస్తుదేమోనని అనిపిస్తుందని కృష్ణ అంటుంది. ముకుందది అంత క్రిమినల్ మైండ్ ఏమి కాదని మురారి అంటాడు. మరొక వైపు రేవతి, నందు ఇద్దరు ఎవరో కావాలనే కృష్ణ , మురారిలు కలిసి ఉంటే చూడలేని వాళ్ళు ఇదంతా చేస్తున్నారని మాట్లాడుకుంటారు. ఇలా డైవర్ట్ చేస్తుంటే ఈ లోపు పెళ్లి అవుతుందని అనుకుంటున్నారని నందుతో రేవతి అంటుంది. మరొకవైపు కృష్ణ, మురారీ ఇద్దరు ఒక దగ్గర శ్రీధర్ హత్య ఫోటోస్ కోసం వెయిట్ చేస్తుంటారు. కాసేపటికి మురారి జైలులో ఉన్న కృష్ణ చిన్నాన్నకి ఫోన్ చేస్తాడు. కృష్ణ మురారి ఇద్దరు ప్రభాకర్ తో మాట్లాడతారు. మరొకవైపు భవాని దగ్గరకి రేవతి వచ్చి ఇదంతా ముకుంద మనుషులు చేస్తున్నారనిపిస్తుంది అంటూ చెప్తుంది. అలా అనగానే నేనేమో కృష్ణ మనుషులు చేస్తున్నారంటే నువ్వు అలా అంటున్నావా అని భవాని అంటుంది.

మరొకవైపు కృష్ణ, మురారీల దగ్గరకీ శ్రీధర్ ఫొటోస్ వచ్చాక అందులో వాళ్ళకి ఒక క్లూ దొరుకుతుంది. శ్రీధర్ చెంపపై అతన్ని కొట్టినవాడి రింగ్ అచ్చులు ఉంటాయి. ఈ రింగ్ ఎవరిదో ఫస్ట్ కనుక్కోవాలని మురారి అంటాడు. అప్పుడే ఎవరో మురారికి కాల్ చేసి శ్రీధర్ అకౌంట్ కి డబ్బులు క్రెడిట్ అయినట్టు.. ఆ నెంబర్ కాశ్మీర్ నెంబర్ అని చెప్తారు. ముందు ఈ రింగ్ ఎవరిదో కనుక్కోవాలని మురారి అంటాడు. మరొకవైపు ముకుంద బాధపడుతు ఉంటుంది. అది చూసిన దేవ్.. ఎలాగైనా మీ పెళ్లి చేసే బాధ్యత నాది అని చెప్తాడు. మరొకవైపు కృష్ణకి మురారి ఐస్ క్రీం తీసుకొని వస్తాడు. తరువాయి భాగంలో అందరూ భోజనం కలిసి చేస్తుంటారు. రేపు మురారి ముకుందలకి నలుగు పెట్టాలని భవాని అంటుంది. దేవ్ భోజనం చేస్తుండగా తన వేలుకి ఉన్న రింగ్ ని కృష్ణ, మురారి ఇద్దరు చూస్తారు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.