English | Telugu

Guppedantha Manasu:జస్ట్ మిస్.. పులి మేక ఆటలో ఎవరు గెలిచినట్లు?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -964 లో... వసుధారని కిడ్నాప్ చేశారని ముసలావిడ లోపలికి వచ్చి రిషికి చెప్పగానే కంగారుగా రిషి లెవబోతుంటాడు. అది చూసిన ముసలివాళ్ళు.. వద్దని చెప్పి వసుధార ఫోన్ రిషికి ఇచ్చి మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైన చెయ్యండి అంటారు. రిషి ఆలోచిస్తూ డాడ్ కి చెప్తే టెన్షన్ పడుతాడని ముకుల్ కి కాల్ చేయాలని అనుకుంటాడు.

కాసేపటికి ముకుల్ కి కాల్ చేస్తాడు రిషి. వసుధార ఫోన్ నుండి కాల్ రావడం ఏంటని అనుకోని.. చెప్పండి మేడమ్ అంటాడు. ఆ తర్వాత రిషి మాటలు విని ఆశ్చర్యపోతాడు. మీరు ఎలా ఉన్నారు రిషి సర్.. అసలు వసుధార ఫోన్ మీ దగ్గరకి ఎలా వచ్చిందంటు అడుగుతాడు. రిషి జరిగిందంతా చెప్తాడు. వసుధార ప్రాబ్లెమ్ లో ఉంది మీరు వచ్చి త్వరగా కాపాడండని రిషి చెప్పగానే ముకుల్ వెంటనే బయలుదేర్తాడు. మరొకవైపు వసుధారని కిడ్నాప్ చేసిన రౌడీలు.. వసుధార నోటికి ప్లాస్టర్ వేస్తారు. అక్కడ రౌడీలంతా కలిసి పులి మేక ఆడుతుంటారు. అప్పుడే అక్కడికి ముకుల్ ఎంట్రీ వస్తాడు. ఇక ఒక్కో రౌడీని చితక్కొడతాడు ముకుల్. కాసేపటికి ముకుల్ ని చూసి వసుధార హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా వసుధారని ముకుల్ అక్కడ నుండి పంపించేస్తాడు. మీ బాస్ ఎవరు అంటు గన్ తో రౌడీ లని బెదిరిస్తాడు. కానీ రౌడీలెవరు చెప్పరు. అప్పుడే శైలేంద్ర ఫోన్ చేసి నేను వస్తున్నానని చెప్తాడు. సరే రండి అని రౌడీలు శైలేంద్రకి చెప్తారు. మరొకవైపు శైలేంద్రకి ధరణి ఫోన్ చేస్తుంటుంది. ఎన్నిసార్లు చేసిన శైలేంద్ర లిఫ్ట్ చెయ్యడు. అప్పుడే దేవయాని వచ్చి ఎందుకు అన్ని సార్లు చేస్తున్నావని కోప్పడుతుంది దాంతో ధరణి ఏడుస్తుంది. అప్పుడే ఫణింద్ర వచ్చి.. ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతాడు. మీ అబ్బాయి ఎక్కడికో హడావిడిగా వెళ్లారు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చెయ్యడం లేదని అనగానే శైలేంద్రకి ఫణీంద్ర ఫోన్ చేస్తాడు. ధరణి అనుకుని ఫణింద్రతో కోపంగా మాట్లాడుతాడు శైలేంద్ర. ఆ తర్వాత ఫణీంద్ర వాయిస్ విని శైలేంద్ర షాక్ అవుతాడు. ఇక శైలేంద్రకి ఫణీంద్ర క్లాస్ పీకుతాడు.

మరొకవైపు రౌడీలని కంట్రోల్ చేస్తున్న ముకుల్ ని భద్ర చూసి.. శైలేంద్రకి ఫోన్ చేసి మీరు ఇప్పుడు ఇక్కడికి రాకండని చెప్తాడు. వసుధర ఇక్కడ లేదు. ఆ ముకుల్ ఉన్నాడని చెప్పగానే శైలేంద్ర రాకుండా వెన్నక్కి వెళ్లిపోతాడు. అలా ముకుల్ ని డైవర్ట్ చేసి రౌడీలని తప్పించుకునేలా భద్ర చేస్తాడు. కాసేపటికి రౌడీలు తప్పించుకున్నారని ముకుల్ డిస్సపాయింట్ అవుతాడు. మరొకవైపు రిషిని తీసుకొని వసుధార బయలుదేర్తుంది. అసలు ఏం జరిగిందని వసుధారకి రిషి చెప్తాడు. ఎవరో కిడ్నాప్ చేశారు తప్పించుకొని వెళ్తు ఫారెస్ట్ లో పడిపోయాను. వాళ్ళు కాపాడారని రిషి చెప్తాడు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.