English | Telugu

పెళ్ళైనవాడి కోసం శ్రీముఖి చూస్తోందంటూ పరువు తీసేసిన అనంత్ శ్రీరామ్ ...

సూపర్ సింగర్ షోలో వెంకటేష్ అనే కంటెస్టెంట్ పాడిన పెళ్లి పాటతో రాహుల్ సిప్లిగంజ్ కి అనంత శ్రీరామ్ , శ్రీముఖి మధ్య పెళ్లి మాటలు ఎపిసోడ్ భలే ఫన్నీగా సాగింది. "సరే మరి పెళ్లి లాంటి ఆలోచనలు పెట్టుకుంటున్నావా లేదంటే ఎప్పటిదప్పుడే అని వదిలేస్తున్నావా.. విజిటింగ్ కార్డేనా వెడ్డింగ్ కార్డు ఇచ్చేదేమైనా ఉందా " అని అనంత్ శ్రీరామ్ అడిగేసరికి "నేను డైలీ చూస్తున్నా" అని రాహుల్ చెప్పేసరికి "డైలీనా" అని శ్రీముఖి షాకయింది. "నేను ఆడవాళ్లను చూస్తున్నా కానీ వాళ్ళే నన్ను చూడడం లేదు..నా దరిద్రం అలా దిగజారింది" అని బాధపడ్డాడు రాహుల్. "అంటే రోజూ పెళ్లిచూపులు కానీ ఏ రోజూ పెళ్లి కావడం లేదన్నమాట" అన్నాడు అనంత్ శ్రీరామ్.

గుప్పెడంత మనసు సీరియల్ లో కీలక మలుపు.. భర్త ఆచూకీ తెలిసేనా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'.  ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-961 లో.. వసుధార కాలేజ్ కి వెళ్తుంటుంది. అయితే తను అలా కాలేజ్ కి వెళ్తుంటే తనెనెవరో ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. ‌ఎవరా అని మొదటిసారి చూస్తే ఎవరూ ఉండరు.. రెండోసారీ చూస్తే భద్ర ఉంటాడు. ఎందుకు నన్ను ఫాలో చేస్తున్నావని భద్రని వసుధార అడుగుతుంది. మహేంద్ర సరే ఫాలో అవ్వమన్నాడని భద్ర అనగానే.. నన్ను ఫాలో అవ్వొద్దని వసుధార అంటుంది. సరే అని భద్ర వెళ్తుంటే అప్పుడే శైలేంద్ర ఎదురుపడాతడు. నిన్ను తననే ఫాలో అవ్వమన్నాను కదా ఎక్కడికెళ్తున్నావని శైలేంద్ర అంటే.. తను ఫాలో అవ్వొద్దని చెప్పిందని భద్ర అంటాడు.

కొత్త కోడలి ముందు పాత కోడలిని అవమానిస్తున్న కుటుంబం.. తనేం చేయనుంది?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ - 294 లో... కళ్యాణ్ అనామికల పెళ్ళిని చూడలేక అప్పు, కనకం, కృష్ణమూర్తి వెళ్లిపోతుంటే  కావ్య వచ్చి వారితో మాట్లాడుతుంది.  నా అత్తింట్లో జరిగే పెళ్ళికి నా పుట్టింటి వాళ్ళు అందరు ఉండాలని ఆశపడ్డాను కానీ ఇలా‌ మీరు మనసు కష్టపెట్టుకుని వెళ్తుంటే మనసుకి బాధగా ఉందని‌ కనకం, కృష్ణమూర్తిలతో కావ్య అంటుంది.  ఇక అప్పుడే కళ్యాణ్ వాళ్ళ అమ్మ ధాన్యలక్ష్మి అక్కడికి వస్తుంది. ఇంకొకసారి ఈ ఇంటివైపు రాకండి. ఇంత మోసం చేస్తారా? నా‌ కొడుకుకి మంచి మనసు ఉంది కాబట్టి నీ తప్పుని కూడా తన తప్పే అని అప్పుని ధాన్యలక్ష్మి  తిడుతుంది. మీరేనా చిన్నత్తయ్య ఇలాగ మాట్లేదని కావ్య అనగానే.. నువ్వు కూడ వీళ్ళతోటే కదా అని ధాన్యలక్ష్మి అంటుంది.

నీ అందానికి ఇన్సూరెన్స్ కట్టావా?.. సుజాతను అడిగిన రాకేష్

ఎక్స్ట్రా జబర్దస్త్ నెక్స్ట్ వీక్ ప్రోమోలో ఒక్కో స్కిట్ ఒక్కో రేంజ్ లో ఉండబోతోంది. ఆ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ చేశారు మల్లెమాల టీమ్. ఇందులో రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత టీమ్ లో పంచ్ లు మాములుగా పేలలేదు. రాకేష్ స్టేజి మీదకు వస్తూనే "అరేయ్ సుజి నువ్వు ఇన్సూరెన్స్ కట్టావా" అనేసరికి సుజాత లేడీ పోలీస్ గెటప్ లో వచ్చి "కారుకా? బండికా?" అని అనుమానంగా అడిగింది. దాంతో రాకేష్ "నీ అందానికి రా" అని అనేసరికి వెనక పోలీస్ గెటప్ లో ఉన్న జ్ఞానేశ్వర్ అనే కమెడియన్ "అరేయ్ ఎందుకురా మనకు అవసరామారా" అనేసరికి రాకేష్ సైలెంట్ అయ్యాడు.