English | Telugu
మెగా ఫామిలీకి, చంద్రబోస్, ఆర్పీ పట్నాయక్ కి ఆర్పీ చేపల పులుసు
Updated : Jan 5, 2024
జబర్దస్త్ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో కిరాక్ ఆర్పీ ఒకరు. ఐతే అక్కడ వచ్చిన కొన్ని ఇబ్బందుల దృష్ట్యా ఆర్పీ ఎప్పుడో ఈ షో నుంచి బయటికి వచ్చి బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టారు. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే రెస్టారెంట్ ప్రారంభించారు ఇక ఈ రెస్టారెంట్ బాగా క్లిక్ అయ్యింది కూడా. హైదరాబాదులో ఒక బ్రాంచ్ ప్రారంభించిన ఈయన ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా బ్రాంచెస్ ప్రారంభించారు.
ఐతే లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో తన రెస్టారెంట్ లోని చేపల పులుసును సెలబ్రిటీలకు కూడా పంపిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. "ఆర్పీ పట్నాయక్ గారికి పంపించాను, చంద్రబోస్ గారికి టు టైమ్స్ పంపించాను, రాంచరణ్-ఉపాసన గారికి, చైరంజీవి గారికి కూడా నా చేపల పులుసు వెళ్ళింది. సెలబ్రిటీస్ కి పంపిస్తున్నాం అనుకున్నప్పుడు ఇంకా ఎంతో శ్రద్ద పెట్టి చేయాలి. ఫీడ్ బ్యాక్ అనవసరం ఎందుకంటే మనం ఎం చేసినా కరెక్ట్ గా చేయాలి అంతే..అందుకే పసుపు కొమ్ములు తెప్పించి ఆడించి, గుంటూరు నుంచి మిర్చి తెప్పించి అంతా పక్కాగా చేస్తున్నాం...ఫీడ్ బ్యాక్ కోసమే నేను చేపల పులుసు పంపను..చేపల పులుసు టేస్ట్ నచ్చి మరోసారి నాకు కాల్ చేయాలనే ఉద్దేశంతోనే సెలబ్రిటీలకు పంపిస్తున్నాను. చేపల పులుసు తయారీ విషయంలో ఎక్కడా పడే ప్రసక్తే లేదు. ప్రస్తుతానికి మణికొండ బ్రాంచ్ కూడా వర్క్ జరుగుతోంది. మా దగ్గర ఉండే లేడీ సీనియర్ షెఫ్స్ ఏదైతే సలహాలు, సూచనలు ఇస్తారో వాటిని ఫాలో ఐతే మాత్రం బిజినెస్ లో మనకు తిరుగే ఉండదు. ఒక పది రూపాయలు పోయినా మంచి రుచికరమైన వంట చేసి అందిస్తే కస్టమర్లు ఎవరూ మన దగ్గర నుంచి తిరిగి వెళ్ళరు" అంటూ కిర్రాక్ ఆర్పీ ఎన్నో విషయాలు చెప్పాడు.