English | Telugu
Guppedantha Manasu:అనుకున్నదే అయింది.. ఆమెను కిడ్నాప్ చేసిన రౌడీలు!
Updated : Jan 4, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -963 లో... వసుధారని రిషి దగ్గరకి తీసుకొని పెద్దాయన వస్తాడు. ఆ పరిస్థితులలో ఉన్న రిషిని చూసి వసుధార ఎమోషనల్ అవుతుంది. ఎలా ఉండేవారు ఎలా అయ్యారంటు బాధపడుతుంది. రిషి కూర్చొని వసుధారతో మాట్లాడలేని స్థితిలో ఉంటాడు. ఇన్ని రోజులు తను అనుభవించిన బాధని రిషికి వసుధార చెప్తుంది. డాడ్ ఎలా ఉన్నారని రిషి అడుగుతాడు. మీపై బెంగ పెట్టుకున్నాడు. నేను, మావయ్య అనుపమ మేడమ్ .. మీ గురించి వెతకని ప్లేస్ లేదని వసుధార చెప్తుంది.
ఆ తర్వాత రిషిని వసుధార కాపాడిన ముసలివాళ్ళకి థాంక్స్ చెప్తుంది. అసలు ఏం జరిగిందని వసుధార అడుగుతుంది. అప్పుడే రిషికి నొప్పిగా ఉండడంతో వసుధారనే రిషి కీ తైలం రాస్తుంది. మరొకవైపు మహేంద్రకి అనుపమ భోజనం వడ్డీస్తుంది. మహేంద్ర భోజనం చెయ్యకుండా ఆలోచిస్తుంటాడు. రిషి ఎక్కడ ఉన్నాడో ఏమోనని టెన్షన్ పడుతుంటాడు. ఈ వసుధార ధర ఎక్కడికైనా వెళ్తే చెప్పి వెళ్ళాలి కదా, ఫోన్ కూడా కలవడం లేదని మహేంద్ర అంటాడు. మరొకవైపు రౌడీలు వసుధరపై కోపంగా ఉంటారు. నన్ను కొట్టి పారిపోతుందా దాన్ని వదిలి పెట్టవద్దు. అ ముసలోడు ఎక్కువ దూరం తీసుకొని వెళ్లి ఉండడు. పదా వెతుకుదామని రౌడీలు అనుకుంటారు. మరోవైపు రిషికి వసుధార తైలం రాస్తుంటుంది. రిషి పరిస్థితిని చూసి వసుధార ఏడుస్తుంటే.. ఏడవకని రిషి చెప్తాడు. ఆ తర్వాత ముసలావిడ వెళ్లి రిషికి గంజినీళ్లు తీసుకొని వస్తుంది. వాటిని రిషికి తాగిపిస్తుంది వసుధార. ఇప్పుడు నీతో మాట్లాడిన తర్వాత నా మనసు తేలికగా అయిందని రిషి అంటూ ఉంటే.. అవును ఈ రోజు హుషారుగా కన్పిస్తున్నాడని పక్కనే ఉన్న ఆ ముసలావిడ అంటుంది.
అ తర్వాత వసుధార చెయ్యి కడుక్కోవడానికి బయటకు వెళ్తుంది. దాంతో రౌడీలు వచ్చి వసుధారకి మత్తు మందు ఇచ్చి తీసుకొని వెళ్తారు. అప్పుడే వసుధారకి ఫోన్ రావడంతో ముసలావిడ ఫోన్ తీసుకొని వస్తుంది. వసుధార కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్లడం చూసి లోపలికి వెళ్లి రిషికి చెప్తుంది. రిషి లెవబోతుంటే.. నువ్వు ఇప్పుడు లేవలేవు.. ఎవరికైనా ఫోన్ చేయమని వసుధార ఫోన్ ని రిషికి ఆ పెద్దయన ఇస్తాడు. ఎవరికి చెయ్యాలని రిషి అనుకుంటాడు. మరొకవైపు రౌడీలు వసుధారని కిడ్నాప్ చేసి శైలేంద్రకి వీడియో కాల్ లో చూపిస్తారు. శైలేంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతు దేవయానికి చెప్తాడు. అప్పుడే ధరణి వచ్చి ఎక్కడికి వెళ్తున్నారు.. నేను వస్తానని అనగానే వద్దని చెప్పి శైలేంద్ర వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.