English | Telugu
Brahmamudi:ప్రియురాలితో అడ్డంగా దొరికిన భర్త.. భార్య ఏం చేయనుంది?
Updated : Jan 4, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -296 లో....దుగ్గిరాల కుటుంబం మొత్తం భోజనం చేసి హాల్లో కూర్చొని ఉంటారు. పాయసం ఇయ్యడం మర్చిపోయానని కావ్య అందరికి పాయసం ఇస్తుంది కానీ అపర్ణ వద్దని అంటుంది. అలాగే ధాన్యలక్ష్మి విషం కక్కే వాళ్ళు పాయసం ఇచ్చిన విషం లాగే ఉంటుందని అనడంతో కావ్య బాధపడుతుంది.
ఆ తర్వాత ఆ మాటలు విన్న రాజ్ పాయసం తిని చాలా బాగుందంటూ అపర్ణ, ధాన్యలక్ష్మికి ఇస్తాడు. అందరు తింటున్నారా అని అడుగుతాడు అందరము తింటున్నామని అనామిక అంటుంది. ఎప్పుడు నానమ్మ చెప్తుంది ఉమ్మడి కుటుంబం అంటే ఇలా ఉండాలని అంటు ఉమ్మడి కుటుంబం యొక్క గొప్పతనం రాజ్ అందరికి చెప్తాడు. మరోవైపు అప్పు చికెన్ వండి అందరిని పిలిచి వడ్డిస్తుంది. తను తినబోతు కళ్యాణ్ జ్ఞాపకాలు గుర్తుకు చేసుకొని బాధపడి తినకుండానే వెళ్లిపోతుంది. అలా అప్పు వెళ్లిపోవడం చుసిన కనకం, కృష్ణమూర్తి, అన్నపూర్ణలు బాధపడతారు. మరొక వైపు దుగ్గిరాల ఫ్యామిలీ అందరు హాల్లో పడుకోవడానికి రెడీ అవుతారు. అందరు సరదగా ట్రూత్ ఆర్ డేర్ ఆడాలని అనుకుంటారు. ఆడవాళ్లు అంత ఒకవైపు మగవాళ్ళు అంత ఒకవైపుగా ఉంటారు. మొదటగా ఇందిరాదేవికి ఛాన్స్ వస్తుంది. నువ్వు బయపడిన సందర్బం చెప్పమని ఇందిరాదేవిని సీతారామయ్య అడుగగా.. తను వయసులో ఉన్నప్పుటి విషయం చెప్తుంటే అది విని అందరు సరదాగా నవ్వుకుంటారు.
ఆ తర్వాత అనామిక వంతు వస్తుంది. నా కొడుకుని ఆస్తి చూసి ప్రేమించావా? అందం చూసి ప్రేమించావా అని అనామికని ధాన్యలక్ష్మి అడుగుతుంది. తన కవితలు చూసి ప్రేమించానని చెప్తుంది. అ తర్వాత రాజ్ వంతు వస్తుంది. నువ్వు వదినకి కిస్ ఇచ్చి ప్రపోజ్ చెయ్యలని కళ్యాణ్ అంటాడు. కావ్యని ప్రపోజ్ చెయ్యడానికి రాజ్ రెడీ అవుతాడు. తరువాయి భాగంలో రాజ్, శ్వేత ఇద్దరు కలిసి ఐస్ క్రీం తింటుంటారు. అలా వాళ్ళిద్దరు తినడం కావ్య చూస్తుంది. ఆతర్వాత రాజ్ కి కావ్య ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారని అడుగుతుంది. మీటింగ్ లో ఉన్నానని రాజ్ చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.