English | Telugu

పల్లవి ప్రశాంత్ కి యూట్యూబ్ నుంచి డబ్బులొస్తాయని తెలీదు..నేనే మోనిటైజ్ చేయించా

బిగ్ బాస్ సీజన్ 7 లో నటుడు శివాజీకి, పల్లవి ప్రశాంత్ కి మధ్య ఉన్న బాండింగ్ గురించి అందరికీ తెలుసు. ఐతే పల్లవి ప్రశాంత్ యుట్యూబ్ అమౌంట్ గురించి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో శివాజీ కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పాడు.

"పల్లవి ప్రశాంత్‌కి యూట్యూబ్‌లో 1.3 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్స్ , ఇన్‌స్టాగ్రామ్‌లో 1.5 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. పల్లవి ప్రశాంత్‌కి మోనిటైజేషన్ గురించి కానీ.. అది చేస్తే డబ్బులు వస్తాయనే విషయం తెలీదంటూ ఒక నిజాన్ని రివీల్ చేసాడు హీరో శివాజీ. ఆ విషయం తెలిసి నాకు చాలా ఆశ్చర్యమేసింది. అందుకే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తరువాత మా ఇంట్లోనే అతనితో మానిటైజేషన్ చేయించా. వాడు చాలా అమాయకుడు. బిగ్ బాస్ మేనేజ్మెంట్ వాడి బ్యాక్ గ్రౌండ్ అంతా చెక్ చేశాకే అమాయకుడని తెలిసి లోపలి తీసుకొచ్చారని విషయం తెలిసింది. సెకండ్ వీక్ లో నాకు ఎవరెవరు ఏమిటి వాళ్ళ ప్లాన్ ఏమిటి అనే విషయాలన్నీ అర్థమయ్యాయి. ప్రశాంత్‌కి రెండు ఫేస్‌లు ఉన్నాయని అంటున్నారు నిజమేనా ? అని నాగార్జున గారు అడిగినప్పుడు కూడా లేదు బాబు గారూ.. వాడ్ని నేను నమ్ముతున్నా అని చెప్పాను.. అదే నిజం అయ్యింది. బయటకి వచ్చి చూసాక గాని నాకు తెలిసింది. అతనికి ఉన్నంత మంది సబ్‌స్క్రైబర్స్ కి అతనికి ఈజీగా పది లక్షలు వస్తాయి. నేను కామన్ మ్యాన్ కె సపోర్ట్ చేశాను అని అప్పుడు అనిపించింది. యావర్ చాల మంచోడు..జెమ్...వాళ్లకు నేను చేసింది ఏమీలేదు కొంత టైం మోటివేట్ చేయడానికి కేటాయించేవాడిని అంతే." అంటూ శివాజీ పల్లవి ప్రశాంత్ గురించి చెప్పుకొచ్చాడు.