English | Telugu

ఆ పాటకు రీల్ చేయండి...గిఫ్ట్ కొట్టండి...భోలే షావలి బంపర్ ఆఫర్

"అత్తగారు పెట్టిన కొత్త వాచి లెక్క" అనే జానపద గీతం సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యిందో అందరికీ తెలుసు . ఈ పాటను రాసి, పాడి, కొరియోగ్రాఫ్ చేసింది భోలే షావలి ..అతనికి జంటగా శుభశ్రీ రాయగురు కూడా పోటీగా డాన్స్ చేసింది. వీళ్ళు బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ గా అదరగొట్టారు. ఈ మధ్య కాలంలో కొత్త కవర్ సాంగ్స్ ని, ఫోక్ సాంగ్స్ ని, మూవీ సాంగ్స్ ని జనాల్లోకి తీసుకెళ్లి మంచి రేటింగ్స్ సంపాదించడం కోసం కొన్ని కాంటెస్టులు పెడుతూ ఉంటారు.

అందులో భాగంగానే భోలే షావలి, శుభశ్రీ ఇద్దరూ కలిసి తమ ఇన్స్టాగ్రామ్ లో ఒక ఆఫర్ ఇచ్చారు. "మీరు కూడా అత్తగారు సాంగ్ ని రీల్ గా చేయండి , నాకు టాగ్ చేయండి , బెస్ట్ వీడియోకి ఒక గిఫ్ట్ ఇస్తా " అంటూ భోలే ఒక ఛాన్స్ ఇచ్చాడు. యూట్యూబ్ లో సాంగ్ రిలీజ్ చేసిన ఒక్క రోజులోనే 6 లక్షలకు పైగా వ్యూస్ సాధించిన భోలే సాంగ్‌ ఇప్పటివరకు 1.3 మిలియన్ల వ్యూస్‌ సొంతం చేసుకుంది. భోలే రిలీజ్‌ చేసిన ‘పాలమ్మిన.. పూలమ్మిన’ సాంగ్‌ సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది.

బిగ్ బాస్ సీజన్ 7 లో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీతో అడుగుపెట్టిన భోలే షావలి చాల తక్కువ సమయంలో ఫేవరెట్‌ కంటెస్టెంట్‌గా మారిపోయాడు. హౌస్ లో తన జర్నీ చాల తక్కువ రోజులే ఐనా కూడా అతని ఆటతీరు, మాటతీరుతో, పాట తీరుతో ఆడియన్స్ మనసులను కొల్లగొట్టాడు. పాటలు, మాటలు, కామెడీతో ఆడియెన్స్‌కు కావాల్సినంత ఎంటర్‌టైన్మెంట్ అందించాడు భోలే. గతంలో కొన్ని మూవీస్ కి మ్యూజిక్ డైరెక్టర్ గా, లిరిక్‌ రైటర్‌గా పని చేసాడు కానీ ఎక్కడా బ్రేక్ రాలేదు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి వచ్చాక అతని పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. మరి మీరు కూడా భోలే సాంగ్ రీల్స్‌ చేసి అతనికి టాగ్ చేసి మీ లక్ ని టెస్ట్ చేసుకోండి .

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.