English | Telugu
నా హీరోకి ఏ దేవుడు సూపర్ పవర్స్ ఇవ్వలేదు.. కష్టపడి తెచ్చుకున్నాడు
Updated : Jan 19, 2024
బుల్లితెర మీద పలు ఈవెంట్స్ లో సందడి చేసే అష్షు రెడ్డి, గుప్పెడంత మనసు సీరియల్ తో హిట్ యాక్ట్రెస్ గా పేరు తెచ్చుకున్న జగతి మేడం అలియాస్ జ్యోతి రాయ్ సుకు పూర్వజ్ డైరెక్ట్ చేసిన “ఏ మాస్టర్ పీస్” మూవీలో కనిపించబోతున్నారు. "శుక్ర, మాటరాని మౌనమిది" వంటి డిఫరెంట్ మూవీస్ తర్వాత సుకు అరవింద్ కృష్ణ , అషు రెడ్డి లీడ్ రోల్స్ తో ఈ మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు. అలాంటి సుకు పూర్వజ్ ఇప్పుడు తన మూవీ గురించి తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఇలా పోస్ట్ చేసుకున్నాడు.
"ఏ మాస్టర్ పీస్ మూవీలో నా హీరోకి ఏ దేవుడు కూడా సూపర్ పవర్స్ ఇవ్వనే ఇవ్వడు..హీరోకి ఉన్న పవర్స్ అన్ని కూడా కష్టపడి సంపాదించుకున్నవే..ఆ పవర్స్ ని ఎలా సంపాదించుకున్నాడనే సబ్జెక్టు ఈ స్టోరీ. కొంచెం టైం వెయిట్ చేయండి.
ఈ ఇయర్ కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నాం" అంటూ పెట్టిన పోస్ట్ ని జ్యోతి రాయ్, అషూ రెడ్డి కూడా వాళ్ళ వాళ్ళ స్టేటస్ లో పోస్ట్ చేసుకున్నారు. అలాగే జ్యోతి రాయ్ కూడా మరో ఇన్స్టా స్టేటస్ పెట్టింది. "ఫేజ్ 1 శివమ్ : ఇన్ హౌస్ సీక్రెట్స్ అండ్ ది రైజ్ ఆఫ్ ఏ.. టీజర్ త్వరలో రాబోతోంది...ఈ మూవీ పనులన్నీ పూర్తయ్యాయి.. పాన్ ఇండియా లెవెల్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది" అని చెప్పింది. ఇక గుప్పెడంత మనసు సీరియల్ తో మంచి ఫేమ్ తెచ్చుకున్న జ్యోతి రాయ్ "దేవర" మూవీలో స్తానం సంపాదించింది.