English | Telugu

Brahmamudi : ఆ విషయం తెలిసి కావ్య మనసు ముక్కలైంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -311 లో.. శ్వేతకి ఇంట్లో ఎవరో ఉన్నారనే డౌట్ వస్తుంది. దాంతో భయంభయంగా ఉంటుంది. డోర్ తీస్తూ కర్రతో కొట్టాలని ప్రయత్నం చేస్తుంది. వెంటనే శ్వేత.. నేను అంటు రాజ్ వస్తాడు. ఆ తర్వాత ఇంట్లో ఎవరో ఉన్నారు. నా చుట్టు ఏదో జరుగుతుందంటూ రాజ్ తో శ్వేత చెప్తుంది. టీవీ దానంతట అదే ఆన్ అయిందని శ్వేత చెప్తుంది. నువ్వు రిమైండర్ పెట్టుకున్నావు అందుకే ఆన్ అయిందని రాజ్ చెప్తాడు. ఆ తర్వాత కావ్యకి ఆఫీస్ స్టాఫ్ లోని ఒకమ్మాయి ఫోన్ చేసి.. సర్ ఇంకా ఆఫీస్ కి రాలేదని చెప్తుంది. బయల్దేరి చాలా టైమ్ అవుతుందని కావ్య చెప్తుంది. డిజైన్స్ కావాలి.. లేదంటే సర్ ని తిడుతారని ఆమె అనగానే.. నేను వేస్తాను పంపించని కావ్య చెప్తుంది.

మరొకవైపు శ్వేత భయపడుతు ఈ ఫ్లవర్ వాజ్ కిందకి పడిపోయింది. ఇంక ఈ స్టాండ్ లో ఉండాల్సిన కత్తి కింద ఉందంటూ చెప్పగానే.. నువ్వేం టెన్షన్ పడకు అన్నీ కనుక్కుందామని శ్వేతకి రాజ్ దైర్యం చెప్తాడు. అలా శ్వేతతో రాజ్ మాట్లాడుతుంటే.. ఎవరో వాళ్ళకి తెలియకుండా వీడియో తీస్తారు. ఆ తర్వాత కావ్య డిజైన్స్ వేస్తి శృతికి పంపిస్తుంది. అప్పుడే రాజ్, శ్వేత ఇద్దరు మాట్లాడుకుంటున్న వీడియోని ఎవరో అజ్ఞాతవ్యక్తి వీడియో తీసి కావ్యకి పంపిస్తాడు. కావ్య ఆ వీడియోని చూసి షాక్ అవుతుంది. అదే గుర్తుచేసుకుంటు ఏడుస్తు ఉంటుంది. మరుసటి రోజు ఉదయం కళ్యాణ్ కవితలు రాస్తుంటే.. అనామిక కాఫీ తీసుకొని వస్తుంది. నువ్వు ఇలాగే రాస్తూ ఉంటావా? ఆఫీస్ కి వెళ్ళవా అని అడుగుతుంది. అన్నయ్య బిజీగా ఉన్నప్పుడు వెళ్తానని కళ్యాణ్ అంటాడు. ఆ పిచ్చి రాతలు రాస్తు ఉంటాడని రాహుల్ అంటాడు. అందరు నేను రాసే కవితలు పిచ్చి రాతలు అంటూ ఉంటారు కానీ నువ్వు మాత్రమే నా కవితలు ఇష్టపడి పెళ్లి చేసుకున్నావని కళ్యాణ్ అనగానే.. నువ్వు ఇలా రాస్తు కూర్చొని ఉంటే ఈ ఇంట్లో నాకేం విలువ ఉంటుందని మనసులో అనామిక అనుకోని వెళ్తు ఉంటే.. రుద్రాణి ఆపి నీ బాధ నాకు అర్థం అయింది. రాజ్ ఒక్కడే ఆఫీస్ చూసుకుంటున్నాడు. కళ్యాణ్, రాహుల్ ఇద్దరికి అసలు సంబంధం లేదని అనామికని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. ఇక మీద ఇలా ఉండకూడదు. ఆఫీస్ వ్యవహారాల్లో వీళ్ళు కూడా ఉండాలి. నేను చెప్పినట్టు మా అత్తయ్య ధాన్యలక్ష్మి దగ్గరకి వెళ్ళి మాట్లాడమని, ఆ తర్వాత నేను చూసుకుంటానని రుద్రాణికి అనామిక చెప్తుంది.

ఆ తర్వాత రాజ్ ఇంటికి వస్తాడు. హాల్లో కూర్చొని ఉన్న ధాన్యలక్ష్మితో.. రుద్రాణి చూసావా రాజ్ ని అందరు పొగుడుతున్నారు. కళ్యాణ్ కూడా అలా ఆఫీస్ బాధ్యతలు చూసుకోవాలి. అనామికకి కూడా అలాగే ఉందని ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతుంది. గదిలోకి వెళ్లిన రాజ్ కి కావ్య డిజైన్స్ ఇస్తుంది కానీ ఎక్కడికి వెళ్లారంటూ ఏం అడుగదు. ఆ తర్వాత ఆఫీస్ లో ఆమెకి రాజ్ కాల్ చేసి.. ఇంటికి ఫోన్ చేసి ఆఫీస్ కి రాలేదని చెప్పావా అని అడుగుతాడు. చెప్పానని అనగానే తనని రాజ్ తిడతాడు. అయినా నన్ను కావ్య ఏం అడగలేదని రాజ్ అనుకుంటాడు. తరువాయి భాగంలో శ్వేతకి గాయం అయితే రాజ్ హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాడు. అక్కడ వాళ్ళని కావ్య చూస్తుంది. ఇద్దరు నర్సులు వాళ్ళు కాబోయ్ భార్యభర్తలంట అని వాళ్ళ మాటలు వినగానే.. కావ్య మనసు ముక్కలు అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.