English | Telugu
సింగర్ దామిణి ప్రేమలేఖ బయటకొచ్చేసింది!
Updated : Jan 19, 2024
బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో మోస్ట్ వాల్యుబుల్ కంటెస్టెంట్స్ కొంతమంది ఉన్నారు. కొందరు తమ మాటతీరుతో ఫేమస్ అయితే మరికొందరు తమ ఆటతీరుతో ఫేమస్ అయ్యారు. అందులో దామిణి బట్ల ఒకరు.
సింగర్ గా హౌస్ లోకి అడుగుపెట్టి తన ప్రవర్తనతో కంటెస్టెంట్స్ చేత బ్యాడ్ అనిపించుకుంది. సీజన్ సెవెన్ లో మొదటి వారం కిరణ్ రాథోడ్, రెండవ వారం షకీల ఎలిమినేట్ కాగా మూడవ వారం సింగర్ దామిణి ఎలిమినేట్ అయింది.సీజన్-7 మొదలైందే ఉల్టా పల్టా థీమ్ తో.. అంటే సాధారణంగా ప్రతీ సీజన్ లో లాగా ఓటింగ్ లో చివరన ఉండేవాళ్ళని కాకుండా ఈ సారి ఉల్టా పల్టా చేసి.. టాప్ లో ఉండేవారిని ఎలిమినేట్ చేస్తారేమో అని అనుకున్నారంతా, కానీ ఆ వారం లీస్ట్ లో ఉన్న దామిణిని ఎలిమినేషన్ చేశారు. అతిగా ఆవేశపడేవాళ్లు, అనవసరంగా వాదిస్తూ సాగదీసేవాళ్లు, తమ డప్పు తామే కొట్టుకునేవాళ్లు, కేవలం డైలాగులకే పరిమితమయ్యేవాళ్లు, వెనకాల గోతులు తవ్వేవాళ్లు, కిచెన్‌కే పరిమితమై ఆడటమే మర్చిపోయేవాళ్లు.. ఇలా ప్రతిసీజన్‌లోనూ ఇలాంటి వాళ్లు కనిపిస్తూనే ఉంటారు. ఈ సీజన్‌లో అలాంటివారున్నారు. అయితే మిగతావాళ్ల సంగతి ఎలా ఉన్నా కిచెన్‌కే పరిమితమైనవాళ్లు మాత్రం హౌస్‌లో ఎక్కువ వారాలు ఉన్న దాఖలాలు లేవు. అందుకేనేమో దామిణి త్వరగా బయటకొచ్చేసింది.
బూతులు మాట్లాడితే నచ్చదని చిరాకుపడ్డ దామిని తాను మాత్రం ఇంగ్లీష్‌లో తెగ బూతులు మాట్లాడింది. ఇక్కడ ఆమెపై విమర్శలు వచ్చాయి. పాటలతో మెప్పించిన సింగర్ ఆటలో, మాటలో మెప్పించలేకపోయింది. ఓ టాస్క్‌లో అయితే ప్రిన్స్‌ను వీర లెవల్లో టార్చర్ పెట్టింది. పేడ ముఖాన కొట్టడమే కాకుండా, తన నోటిలో కూడా వేసింది. ఇది టాస్కే అయినప్పటికీ గ్యాప్ ఇవ్వకుండా నోటిలో పేడ కొట్టడం అస్సలు కరెక్ట్ కాదన్న కామెంట్లు వినిపించాయి. అలా వింత ప్రవర్తన నెటిజన్లకి తీవ్రంగా ఇబ్బంది కల్గించాయి. అందుకే ఆడియన్స్ తనని తొందరగా బయటకు తీసుకొచ్చేశారు. హౌస్ నుండి బయటకొచ్చాక సీజన్ సెవెన్ కంటెస్టెంట్స్ అప్పుడప్పుడు కలుస్తున్నా దామిణి మాత్రం తన ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ తో బిజీగా ఉంటుంది. తాజాగా తన ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ ఒకటి స్పాటిఫై ఆప్ లో అందుబాటులో ఉందంటూ చెప్పుకొచ్చింది దామిణి. ఇన్ స్టాగ్రామ్ లో తన సాంగ్ ఆల్బమ్ " ప్రేమలేఖ" లింక్ ని షేర్ చేసిన దామిణి.. ఇలా ఆడియోతో పాటు వీడియోకి కూడా మీ సపోర్ట్ కావాలని ఆడియన్స్ కోరింది. కాగా ఇప్పుడు ఈ పాట ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.