English | Telugu

కొత్త బంధాలతో రతికరోజ్.. ఆ ఇద్దరు ఎవరంటే!

రతికరోజ్.. బిగ్ బాస్ సీజన్ సెవెన్ తో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. అటు పల్లవి ప్రశాంత్ తో ఇటు ప్రిన్స్ యావర్ తో లవ్ ట్రాక్ నడిపి బిగ్ బాస్ అభిమానులకి 'బేబీ' సినిమా చూపించేసింది.

బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో మొదటి రెండువారాల్లో రతిక ఆట చూసి ఈసారి టాప్-5 లో గ్యారెంటీగా ఉంటుందనుకున్నారు. హౌస్ లో సీక్రెట్ రూమ్ కి రతికని పిలిచి ఉడతా ఉడతా ఊచ్ పాట ప్లే చేసి ఎన్నిసార్లు ఉడతా అని వచ్చిందో బిగ్ బాస్ చెప్పమన్నప్పుడు .. సరిగ్గా లెక్కవేసి చెప్పినందుకు నాగార్జునతో పాటు ఆడియన్స్ షాక్ అయ్యారు. ఇంత ఇంటలిజెన్స్ గేమ్ ప్లేయర్ బిగ్ బాస్ సెవెన్ లో ఉందా అని అనుకున్నారంతా.. కానీ ఆ తర్వాత ప్రశాంత్ కలిపిన పులిహోర సరిగ్గా రాకపోయేసరికి అభిమానులు తెగ ద్వేషించారు. ఇక ప్రశాంత్ తో గొడవ జరిగిన నాటి నుండి యావర్ ని అమర్ అని అనడం.. ఒకే ప్లేట్ లో కలిసి తినడం చూసి అంతా మరో బకరా రెడీ అని ట్రోల్స్ చేశారు. అయితే తన నేచర్ ని చూసి ఇంత కన్నింగ్, ఫ్లిప్పింగ్ ఎవరు లేరని అర్థమైపోయింది. సోషల్ మీడియాలోని నెటిజన్లు ఒకకానొక దశలో తను రతిక పాప కాదు డీజే టిల్లు సినిమాలోని రాధిక పాప అని కూడా అన్నారు. అలా తనకి నెగెటివ్ టాక్ వచ్చేసింది.

బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో రెండు సార్లు ఎలిమినేషన్ అయి .. రెండు సార్లు లోపలికి వెళ్ళిన ఒకే ఒక కంటెస్టెంట్ రతికరోజ్. తను మొదట ఎలిమినేషన్ అయినప్పుడు సీరియల్ బ్యాచ్ తో క్లోజ్ గా ఉంది. సెకెండ్ టైమ్ ఎంట్రీ ఇచ్చినప్పుడు శివాజీ కాళ్ళు మొక్కి మరీ.. ఇక నుండి బాగుంటానని చెప్పింది. ఆ తర్వాత ప్రశాంత్ ని అక్కని పిలవకని చెప్పడం అదంతా కంటెంట్ కోసమే చేస్తుందని అందరు గ్రహించడంతో తన గేమ్ హౌస్ లోని కంటెస్టెంట్స్ కూడా అర్థమైంది. ఇక సీజన్ ముగిసాక బయట ట్రావెల్ వ్లాగ్స్, ఫుడ్ వ్లాగ్స్ చేస్తూ బిజీగా ఉంటుంది రతిక. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో టేస్టీ తేజ, అమర్ దీప్ లతో కలిసి దిగిన కొన్ని ఫోటోలని షేర్ చేసింది. " మంచి పనులని లైఫ్ లోకి రానివ్వాలి.‌ ఇది కొత్త ఆరంభం " అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. కాగా ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ఈ ఫోటోలు ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ ఫోటోలని చూసిన అమర్ దీప్ ఫ్యాన్స్, ప్రశాంత్ ఫ్యాన్స్ తెగ కామెంట్లు చేస్తూ ట్రోలింగ్ మొదలెట్టారు.