English | Telugu
ట్రెండింగ్ లో అంటే శంకర్ కూడా.. అరియానాకి ప్లస్ అవ్వనుందా!
Updated : Jan 20, 2024
ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమాలకి క్రేజ్ ఎంతుందో.. వెబ్ సిరీస్ లకి కూడా అంతే క్రేజ్ ఉంది. స్టార్ హీరో హీరోయిన్ లు సైతం ప్రస్తుతం కొత్త వెబ్ సిరీస్ లతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో రీలీజైన 90' వెబ్ సిరీస్ ఎంతోమందికి కనెక్ట్ అయింది. ఇందులోని ప్రతీపాత్ర అందరికి నచ్చేయడంతో ఓటీటీ వేదికపై ఈ వెబ్ సిరీస్ సక్సెస్ సాధించింది. ఇప్పుడు అదేకోవలోకి అరియానా చేసిన ఓ వెబ్ సిరీస్ చేరుకుంది.
అరియానా ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తోన్న బ్యూటీ. ఈ బ్యూటీ కూడా ఓ వెబ్ సిరీస్ చేసింది. దాంతో రెగ్యులర్ గా షూట్స్ తో బిజీగా ఉంటుంది. అయితే తాజాగా యూట్యూబ్ లో "అంటే శంకర్ కూడా "అనే వెబ్ సిరీస్ విడుదలైంది. దీనికి అత్యధిక వీక్షకాధరణ లభిస్తోంది. యూట్యూబ్ లో కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ లని జనాలు ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు. " అంటే శంకర్ కూడా " వెబ్ సిరీస్ లోని కథ యూత్ ని అట్రాక్ట్ చేయడంతో ప్రస్తుతం ట్రెండింగ్ లో నడుస్తోంది. దాంతో ఈ అరియానాకి మరింత హైప్ వచ్చేసింది. తాజాగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ ముగిసింది. ఈ సీజన్ లో అమర్ దీప్ కి సపోర్ట్ చేసిన ఈ భామ.. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అరియానాపై చేసిన ట్రోల్స్, కామెంట్లతో ఆ మధ్య ఏడ్చేసింది. ఎప్పుడు పొట్టి డ్రెస్సులు, బికీనీలతో అందాల ఆరబోత చేసే ఈ భామ.. ఇప్పుడు మరో కంటెంట్ తో ప్రేక్షకులకి దగ్గరైంది.
అరియానా తన ఫోటోలను రెగ్యులర్ గా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది. ఒక్కోసారి తనపై ఎన్ని కామెంట్లు వచ్చిన వాటిని లెక్కచేయకుండా.. తనకు నచ్చింది ఓపెన్‌గా మాట్లాడటంలో ఆమె ఎప్పుడు ముందుంటుంది. మొదట ఆర్జీవీ ఇంటర్వ్యూతో గుర్తింపు పొందిన అరియానా.. బిగ్‌బాస్ రియాలిటీ షోలో ఎంట్రీ ఇచ్చి మరింత పాపులర్ అయ్యింది. చలాకీతనం, ముక్కుసూటితనంతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను అరియానా సొంతం చేసుకుంది. అమర్ దీప్ తో కలిసి చేసిన ఇంటర్వ్యూ కూడా ఈ మధ్య ట్రెండింగ్ లో ఉంది. అంటే శంకరానికి హిట్ టాక్ పొందుతోంది. మరి ఇది అరియానాకి మరిన్ని అవకాశాలు వస్తాయో లేదో చూడాలి. "అంటే శంకర్ కూడా" వెబ్ సిరీస్ అరియానా కెరీర్ కి ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి మరి.