English | Telugu
90’s వెబ్ సిరీస్ గురించి శివాజీ ఎమోషనల్ స్పీచ్.!
Updated : Jan 20, 2024
బిగ్ బాస్ సీజన్ సెవెన్ తో గుర్తింపు తెచ్చుకున్న వారిలో శివాజీ ఒకడు. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ గెలవడానికి కూడా ఫ్రధాన కారణం శివాజీనే అని అందరికి తెలుసు. తాజాగా ఈటీవీ విన్ లో విడుదలైన #90' s వెబ్ సిరీస్ లో నటించిన శివాజీ.. ఈ సిరీస్ సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలని షేర్ చేసుకున్నాడు.
శివాజీ ఒకప్పుడు సినిమాలు చేసి కొంత బ్రేక్ తీసుకున్నాడు. మాస్టర్ సినిమాలో చిరంజీవితో పాటు చేసాడు. ఆ తర్వాత ఖుషీ సినిమాలో పవన్ కళ్యాణ్ కి ఫ్రెండ్ పాత్రని చేసి అప్పట్లోనే ట్రెండ్ సృష్టించాడు. ఇక ఆ తర్వాత తాజ్ మహల్ లాంటి ప్రేమకథలు కూడా చేసాడు. ఇక నీలకంఠ దర్శకత్వంలో
'మిస్సమ్మ' సినిమా చేసి విమర్శకుల ప్రశంసలు పొందాడు. ఆ తర్వాత కొన్ని అడపాదడపా సినిమాలు చేసిన అవి పెద్దగా ఆడలేదు. దాంతో కాస్త విరామం తీసుకొని మళ్ళీ బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఎంట్రీతో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. హౌస్ లో ప్రశాంత్, యావర్ లకి ఇంట్లోని ఓ పెద్దన్నలాగా అండగా ఉండి వారికి సరైన సమయంలో సరైన సూచనలిస్తూ టాప్-5 లో ఉండేలా చేశాడు. బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఇంత సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణం శివాజీ, ప్రశాంత్, యావర్ అని అనడంలో అతిశయోక్తి లేదు.
బిగ్ బాస్ కి ముందు #90's అనే వెబ్ సిరీస్ చేసాడు శివాజీ. ఇందులో వాసుకీ, మౌళి, ఆదిత్య ప్రధాన పాత్రలలో నటించి మెప్పించారు. అయితే ఈ సీరీస్ లో ఇంట్లో అందరి కన్నా చిన్నవాడి పాత్రలో ఆదిత్య ఆకట్టున్నాడు. అందరి ఇంట్లో చిన్నవాళ్ళు చూపించే గడుసుతనం, అల్లరి, చిలిపిపనులు, యాక్టింగ్ అన్నీ కూడా బాగా చేశాడు. ఈ సీరీస్ తో ఈ బుడ్డోడికి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇక శివాజీ నిన్నటి సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ.. ఈ సీరీస్ హిట్ అవ్వడానికి ప్రధాన కారణం డైరెక్టర్ ఆదిత్య అని చెప్పాడు. మౌళి, వాసుకి, ఆదిత్య ఇలా ప్రతీ ఒక్కరు తమ పాత్రలకి న్యాయం చేశారు. ప్రతీ సీన్ చాలా సహజంగా ఉండేలా కెమెరామెన్, టెక్నికల్ విభాగం వారు జాగ్రత్తపడ్డారంటూ.. ఈ సిరీస్ సక్సెస్ ని యూనిట్ మొత్తానికి ఇచ్చేశాడు శివాజీ. ఈ సిరీస్ సక్సెస్ మీట్ ని శివాజీ తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియోకి అత్యధిక వీక్షకాధరణ లభిస్తోంది.