English | Telugu

Eto Vellipoindhi Manasu:ఎటో వెళ్ళిపోయింది మనసులో కీలక మలుపు.. అసలు మాణిక్యం ఎవరు?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ ఎపిసోడ్ -3 లో.. రామలక్ష్మి నాన్న ఫుల్ గా తాగి వైన్స్ దగ్గరే పడిపోయి ఉంటాడు. అతన్ని తీసుకొని రావడానికి రామలక్ష్మి వెళ్తుంది. అక్కడ అందరు తనని అదోరకంగా చూస్తుంటారు. రామలక్ష్మి ఇబ్బంది పడుతునే లోపలికి వెళ్లి.. తన తండ్రిని తీసుకొని ఇంటికి వస్తుంది.

మరొకవైపు ఇంట్లో చికెన్ ముక్క వండక నెలరోజులు అవుతుందంటూ రామలక్ష్మి చెల్లెలు పాట పాడుతుంది. అప్పుడే అక్కడికి రామలక్ష్మి తన తండ్రి (మాణిక్యం)ని తీసుకొని వస్తుంది. తన తల్లి తిట్టబోతుంటే వద్దని ఆపి భోజనం పెట్టమని చెప్తుంది. ఆ తర్వాత భోజనం చేసిన మాణిక్యాన్ని తీసుకొని వెళ్లి పడుకోపెడుతుంది రామలక్ష్మి. నీ తండ్రి ఒక తాగుబోతు వాడని అనుకుంటున్నావా? నేను ఒక్కప్పుడు హీరో లాగా ఉన్నాను.. కానీ ఒక ఫ్యామిలీ వల్ల నేను ఇలా మారాల్సి వచ్చిందని చెప్తాడు. తన తండ్రిని అలా చూసేసరికి రామలక్ష్మికి బాధేస్తుంది. సీతాకాంత్ తన తాతయ్య, తన తల్లి ముగ్గురు కలిసి ఒక పెద్ద ఫ్రేమ్ తో ఉన్న మాణిక్యం ఫోటో చూస్తూ వాళ్ళ ఫ్యామిలీకి చేసిన నమ్మక ద్రోహం గురించి మాట్లాడుకుంటారు. ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా ఆ మాణిక్యం దొరకలేదు. ఇంకా వాడి వాళ్ళ మన కుటుంబానికి ఎలాంటి ప్రాబ్లమ్ ఉందోనని మాట్లాడుకుంటారు. ఇన్ని సంవత్సరాలైన వాడు చేసిన మోసం మర్చిపోలేకపోతున్నాం.. వాడు చేసిన నమ్మక ద్రోహం అలాంటిదంటూ మాణిక్యం గురించి మాట్లాడుకుంటారు. మరుసటి రోజు ఉదయం మాణిక్యం దగ్గరికి తన భార్య వచ్చి.. రాత్రి మన కూతురికి ఎందుకు అబద్ధాలు చెప్తున్నారని అడుగుతుంది. అలా చెప్తేనే కదా డబ్బులు ఇస్తుంది. నేను మోసగాడినని నాకు తెలుసంటు విలన్ లాగా మాణిక్యం మాట్లాడతాడు. ఆ తర్వాత రామలక్ష్మి తమ్ముడు ధనకి ఒక అమ్మయి సైట్ కొడుతుంటే మాణిక్యం పిలిచి తిడతాడు. ఆ తర్వాత ధన దగ్గరికి వెళ్లి.. నువ్వు ప్రేమించాల్సింది బస్తీ అమ్మయిని కాదు కోటిశ్వరురాలిని. నీకు నేను ఏం ఆస్తులు ఇవ్వలేదు. అందం మాత్రం ఇచ్చాను. మంచి డబ్బున్న అమ్మయిని లవ్ చేయమని చెప్తాడు.

ఆ తర్వాత సీతాకాంత్ చెల్లెలు కాలేజీకి వెళ్తుంటే తనకి సెక్యూరిటీ గా ఇద్దరు ఉంటారు. నాకు అలా సెక్యూరిటీ ఉంటే కాలేజీలో ఇబ్బందిగా ఉంటుంది. ప్లీజ్ వద్దని సీతాకాంత్ కి వెళ్లి చెప్తుంది. అయిన వినకుండా వాళ్ళని తనతో పాటు కాలేజీ పంపిస్తాడు. అలా తన విషయంలో చెయ్యడం కరెక్ట్ కాదేమోనని సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అంటాడు. ఇలా చేస్తున్నా కాబట్టే తనని కాపాడుకుంటున్నానని సీతాకాంత్ అంటాడు. ఈ కథలో మెయిన్ విలన్ మాణిక్యం. అతనికి సీతాకాంత్ కి సంబంధమేంటో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.