English | Telugu

మాల్దీవ్స్ రిసార్ట్ లో బూతుల స్కిట్..

ఢీ సెలబ్రిటీ స్పెషల్ లో ఈ వారం అంతా బూతులే బూతులు వినిపించాయి. డాన్స్ షోలో టాస్కులు చేసి చాలా రోజులయ్యిందంటూ హైపర్ ఆది ఒక బూతు టాస్క్ ఐతే చేసి మంచి హాట్ డైలాగ్స్ తో రక్తి కట్టించి కాస్త ఫన్ క్రియేట్ చేసాడు. పిల్లలతో కలిసి ఈ స్కిట్ చూసిన వాళ్ళు మాత్రం కచ్చితంగా చెవులు, కళ్ళు మూసుకోవాల్సిందే అన్నట్టుగా ఉంది. ఆదికి ఒక వైఫ్ గా నటించిన శ్రీప్రియ వచ్చి గోవా వెకేషన్ కి తీసుకెళ్లొచ్చుగా అని అడిగేసరికి నువ్వే కాదు వేరొకరి డెసిషన్ తీసుకోవాలంటూ మరో వైఫ్ మహేశ్వరిని పిలిచాడు ఆది. "ఏమే గోవాకి వెకేషన్ కి వెల్దామా అనేసరికి వద్దండి మాల్దీవ్స్ కి వెళదాం" అని గారంగా చెప్పింది.

"ఓహ్ నువ్ ఆల్రెడీ గోవా వెళ్ళావా ఐతే మాల్దీవ్స్ వెళ్ళాక సాధారణంగా కోళ్లు గుడ్లు పెడతాయి..కానీ ఈసారి మంచంకోళ్లు గుడ్లు పెట్టబోతున్నాయి.. మన బెడ్డు గొడ్డులా అరుస్తుంది ...దుప్పట్లు చప్పట్లు కొడతాయి..ఈరోజు రూమంతా కామ్ అవుతుంది కానీ మనం కామ్ గా ఉండం కదా" అంటూ హాట్ ప్రాసలతో చెప్పిన డైలాగ్స్ కి శ్రీప్రియ, మహేశ్వరి ఫుల్లుగా నవ్వుకున్నారు. ఇక అదే మాల్దీవ్స్ రిసార్ట్ కి లాస్ట్ వీక్ ఎపిసోడ్ లో పెళ్లి చేసుకున్న కుమార్ మాష్టర్, జెస్సి వచ్చారు. ఇక ఆది వాళ్ళ మీద కూడా బూతు డైలాగ్స్ వేసేశాడు.."మీరిద్దరూ మాల్దీవ్స్ కి ఎందుకొచ్చారు బుల్లి జెసిని, బుల్లి కుమార్ ని ఇవ్వడానికా...సరే కానీ మా ఆవిడ నిద్రపోవడానికి తలగడ లేదంటా" అని చెప్పి కుమార్ నెత్తి మీద ఉన్న విగ్ ని లాక్కుపోయాడు ఆది. దాంతో కుమార్ మాష్టర్ తల తిప్పేసుకున్నాడు. ఇలా వీళ్లంతా కలిసి ఒక బూతు స్కిట్ వేసి అందరినీ నవ్వుల్లో ముంచెత్తారు.