English | Telugu

Ambati Arjun:వహ్వా అనిపించేలా అంబటి సురేఖ మెటర్నిటీ ఫోటోషూట్!

భార్యభర్తలిద్దరికి తమ పిల్లలంటే ఎంతో ఇష్టం ఉంటుంది‌. ఎంతలా అంటే తమ కడుపు నిండా పోయిన పిల్లల కడపునిండా తినాలని ఆలోచిస్తుంటారు. అలాగే ఏ తల్లి అయిన తమ పిల్లల్ని కడుపులో ఉన్నప్పటి నుండే ప్రేమించడం ప్రారంభిస్తుంది. అందుకే ప్రెగ్నెన్సి టైమ్ లో తల్లి ఎంతగానో మురిసిపోతుంది. దానిని ఓ జ్ఞాపకంలా ఉంచడానికి అంబటి అర్జున్ తన భార్యతో కలిసి మెటర్నిటి ఫోటో షూట్ చేశాడు‌.

ప్రస్తుతం మార్కెట్ లోకి ఎన్నోరకాల ఫోటోషూట్ లు వచ్చాయి. అప్పుడే పుట్టిన బాబు నుండి మొదలుకొని బాబు పుట్టినరోజు ఫోటోషూట్, అన్నప్రాసన ఫోటో షూట్, స్కూలింగ్ ఫోటో షూట్, వాకింగ్ ఫోటో షూట్.. పెళ్ళి షూట్, ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్.. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే వస్తుంది. అయితే మెటర్నిటి ఫోటోషూట్ ఈ మధ్య ట్రెండింగ్ లోకి వచ్చేసింది. విదేశాలలో కొన్ని సంవత్సరాల క్రితం మొదలైన ఈ మెటర్నిటి ఫోటోషూట్ కల్చర్ ఇప్పుడు ఇండియాకి వచ్చేసింది‌. అక్కడ విదేశాలలో పొట్ట మొత్తం కనపడేలా వీడియోలు, ఫోటోలతో సెలెబ్రేట్ చేసుకుంటారు‌. ఇక ఇప్పుడు అదే ఇక్కడ మొదలైంది. బిగ్ బాస్ సీజన్‌ సెవెన్ కంటెస్టెంట్ అంబటి అర్జున్ తన భార్య కోసం మెటర్నిటి ఫోటోషూట్ చేపించాడు. అది ఇప్పుడు వైరల్ గా మారింది.

బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో‌ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వెళ్ళిన కంటెస్టెంట్ అంబటి అర్జున్. హౌస్ లోకి వెళ్ళిన మొదటి వారం నామినేషన్ లోనే అతని మనస్తత్వం అందరికి అర్థమైంది. తన ఫ్రెండ్ అమర్ దీప్ ని నామినేషన్ చేసి అతడికి షాకిచ్చాడు. ఆ తర్వాత గేమ్ లో‌ గానీ హౌస్ లో గానీ ఏ హౌస్ మేట్ అయిన తప్పు చేస్తే అది అప్పుడు చెప్పకుండ నామినేషన్ లో చెప్పేవాడు. నేను తప్పు చేయను..‌ నా ముందు తప్పు చేస్తే నేను ఊరుకోను అన్న ధోరణిలో‌ అంబటి అర్జున్ ఉండేవాడు. ఇక ఫ్యామిలీ వీక్ లో ప్రెగ్నెంట్ తో ఉన్న అంబటి సురేఖ హౌస్ లోకి వచ్చింది. దాంతో హౌస్ అంతా కలసి తనకి శ్రీమంతపు వేడుక చేశారు.‌ ఇక బిగ్ బాస్ సీజన్ ముగిసాక స్టేజ్ మీద నాగార్జునతో‌ అంబటి అర్జున్‌ మరియు తన భార్య అంబటి సురేఖ కలిసి దిగిన ఫోటోలే బిగ్ బాస్ జ్ఞాపకాలంటూ షేర్ చేసాడు.‌ కొన్ని రోజుల క్రితం వీరికి పాప పుట్టింది‌. ఇప్పుడేమో అంబటి సురేఖ ప్రెగ్నెన్సీతో‌ ఉన్నప్పుడు చేసిన మెటర్నిటి ఫోటోషూట్ ని తన ఇ‌న్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేశాడు అర్జున్. అచ్చ తెలుగు సంప్రదాయాలకి ప్రతీకగా ఈ ఫోటోషూట్ ఉంది. అందుకే ఇప్పుడు వైరల్ గా మారింది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.