English | Telugu
బిగ్ బాస్ 7 కి వెళ్లి తప్పు చేసానని భోరున ఏడుస్తున్న ప్రియాంక
Updated : Jan 25, 2024
బిగ్ బాస్ సీజన్ 7 (bigg boss season 7) లో ఎవరు విన్ అయ్యారు ఎవరు హౌస్ నుంచి వెళ్లిపోయారు అనే కంటే ఎంత మంది కంటెస్ట్ లు ప్రేక్షకుల మనసుని గెల్చుకున్నారు అనడం కరెక్ట్. ఎందుకంటే షో జరిగిన అన్ని రోజులు కూడా షో లో పాల్గొన్న వాళ్లలో చాలా మందికి అభిమానులు ఏర్పడతారు. అలా అందరికంటే కొంచం ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్న కంటెస్ట్ ప్రియాంక జైన్ (priyanka jain) తాజాగా ఆమె బిగ్ బాస్ గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.
ప్రియాంక తాజాగా తన యూట్యూబ్ ఛానెల్లో ఏడుస్తూ ఒక వీడియో అప్ లోడ్ చేసింది. నేను బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి తప్పు చేసానని నేను హౌస్ లో ఉన్న టైం లో మా అమ్మ క్యాన్సర్ బారిన పడిందని చెప్పుకొచ్చింది. పైగా ఆ విషయం గురించి పూర్తి వివరణ కూడా ఇచ్చింది. మా అమ్మకి పీరియడ్స్ టైం లో బ్లీడింగ్ బాగా ఎక్కువ అయ్యింది హాస్పిటల్ కి వెళ్లాల్సి ఉన్నా కూడా అమ్మ వెళ్ళలేదు. వయసు పెరుగుతుండటం వలన వచ్చిన ప్రోబ్లేమేమో అని లైట్ తీసుకుంది. ఒక వేళ హాస్పిటల్ లో జాయిన్ అవ్వాల్సి వస్తే టీవీ లో నన్ను మిస్ అవుతానని అమ్మ వెళ్ళలేదు అని ఏడుస్తూ చెప్పుకొచ్చింది.
ఆ తర్వాత నేను హౌస్ నుంచి బయటకి రాగానే అమ్మ ని తీసుకొని హాస్పిటల్ కి వెళ్ళాను. అప్పుడే అమ్మకి క్యాన్సర్ మొదటి దశలో ఉందని అర్ధం అయ్యింది.అందుకే అమ్మకి పీరియడ్స్ వచ్చినప్పుడు బ్లీడింగ్ ఎక్కువ అయ్యేదని చెప్పింది. దాని తర్వాత అమ్మకి సర్జరీ చేయించానని సర్జరీ సక్సెస్ అయ్యిందనే విషయాన్ని కూడా ఆమె వెల్లడి చేసింది. ఈ విధంగా తనకి బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చాక ప్రాబ్లమ్స్ పెరియాగాని కూడా ఆమె చెప్పింది. ప్రియాంక కి సినిమాల ద్వారా రాని గుర్తింపు బిగ్ బాస్ ద్వారా వచ్చింది.