English | Telugu

సంవత్సరం పూర్తి చేసుకున్న బ్రహ్మముడి సీరియల్!

క్రికెట్ లో‌ సెంచరీ కొడితే బ్యాట్స్‌మెన్ తో పాటు టీమ్ అంతా ఎంత ఆనందిస్తారో.. సినిమాలు వంద రోజులు ఆడితే ఆ సినిమా ప్రొడ్యూసర్, దర్శకులు, నటీనటులు ఎంత హ్యాపీగా ఉంటారో అందరికి తెలిసిందే. అచ్చం అలాగే ఓ సీరియల్ ఒక సంవత్సరం పూర్తి అయిందంటే ఆ సీరియల్ యూనిట్ కూడా అంతే హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు అదే జరిగింది. స్టార్ మా టీవీలో‌ ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి.. మొదలై సరిగ్గా సంవత్సరం అయింది.

ఈ సీరియల్ లో కృష్ణమూర్తి-కనకం ఫ్యామిలీ ఉంటుంది. వీళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్ ని గడుపుతారు. ఇక మరోవైపు దుగ్గిరాల కుటుంబం ఉంటుంది‌ వీళ్ళు రిచ్ లైఫ్ ని గడుపుతారు. అయితే కృష్ణమూర్తి-కనకం దంపతులకు ముగ్గురు కూతుళ్లు.. పెద్ద అమ్మాయి స్వప్న, రెండో అమ్మాయి కావ్య.. మూడవ అమ్మాయి అప్పు. కనకం తన పెద్ద కూతురికి పెద్దింటి సంబంధమే చేస్తానని చెప్పి గొప్ప కళలు కనమని చెప్తుంది. అలా తనని ఆశపెట్టిన కనకం ఎలాగైనా దుగ్గిరాల ఇంటికి తన కూతళ్ళని కోడల్లుగా చేయాలని భావిస్తుంది. అలా మొదట రాజ్ తో స్వప్న ఎంగేజ్ మెంట్ అవ్వగా.. రాజ్ వాళ్ళ అత్త కొడుకు రాహుల్ ఆ స్వప్నని లవ్ చేస్తున్నట్టు నటించి రాజ్ తో పెళ్లి జరగకుండా పెళ్ళిపీటల మీద నుండి లేపుకెళ్తాడు. దాంతో కనకం తన రెండో కూతురు కావ్యని రాజ్ తో పెళ్ళికి ఒప్పిస్తుంది. అలా కావ్య రాజ్ ల పెళ్ళి అవుతుంది. ఇక కొన్ని ఎపిసోడ్ ల తర్వాత స్వప్న రాహుల్ ల వివాహం జరుగుతుంది. ఇక కళ్యాణ్-అనామికల ప్రేమాయణం తర్వాత వాళ్ళిద్దరి పెళ్ళి జరుగుతుంది.

అయితే కళ్యాణ్ ని అప్పు ప్రేమించిన విషయం కళ్యాణ్-అనామికల పెళ్ళి రోజు చెప్తుంది. దాంతో అప్పుని అసహ్యించుకుంటుంది కళ్యాణ్ వాళ్ళ అమ్మ ధాన్యలక్ష్మి. ఇక అప్పుతో పాటు కనకం, కృష్ణమూర్తిలని కావ్యని కూడా అసహ్యించుకుంటుంది. ఇక కావ్యని సాధిస్తుంటుంది ధాన్యలక్ష్మి. మరోవైపు శ్వేత అనే అమ్మాయిని రాజ్ ఎప్పుడు కలుస్తుంటాడు. అలా శ్వేతతో రాజ్ ఉన్న ప్రతీసారీ కావ్యకి అడ్డంగా దొరికిపోతాడు. దాంతో కావ్య భాదపడుతుంది. మరోవైపు కొత్త కోడలు అనామికని రుద్రాణి తన ఎత్తుగడతో మారుస్తుంది. అసలు రాజ్, శ్వేతల మధ్య బంధమేంటి? అనామిక నిజస్వరూపం తెలిసేనా.. ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతో ఈ సీరీయల్ ప్రస్తుతం కొనసాగుతుంది. ఇక సీరియల్ మొదలై సరిగ్గా సంవత్సరం కావడంతో బ్రహ్మముడిలోని షర్మిత, మానస్, దీపిక రంగరాజు, నీప, కళ్యాణ్, సుప్రియ ఇలా అందరు కలిసి సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇదే విషయాన్ని డైరెక్టర్ కుమార్ పంతంతో పాటుగా యూనిట్ అంత తమ ఇన్ స్ట్రాగ్రామ్ పేజీలలో షేర్ చేసారు. ప్రస్తుతం టీఆర్పీలో బ్రహ్మముడి నెంబర్ వన్ గా కొనసాగుతుంది.

Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.