English | Telugu
Priyanka Jain: అమ్మకి క్యాన్సర్ .. మేము చేసిన తప్పు మీరు చేయకండి!
Updated : Jan 24, 2024
ప్రతీ ఒక్కరి జీవితంలో అమ్మనాన్న చాలా ముఖ్యమైన వాళ్ళు. వారే లేకుంటే.. సమాజంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మనకి ఓ స్టేజ్ వచ్చాక అమ్మనాన్నలని జాగ్రత్తగా చూసుకోవాలి. అలా చూసుకోవడానికి ఏమైనా చేయాలి.. ఎంత దూరమైన వెళ్ళాలి. ప్రియాంక జైన్ వాళ్ళ అమ్మకి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ అంట. ఆ విషయాన్ని యూట్యూబ్ ఛానెల్ లోని వ్లాగ్ ద్వారా తను తెలియజేసింది.
జానకి కలగనలేదు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి దగ్గర అయింది ప్రియాంక. బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో మొదటి కంటెస్టెంట్ గా అడుగుపెట్టి తన ఆటతీరుతో, మాటతీరుతో ఎంతో ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. హౌస్ లో ఉన్నప్పుడు సీరియల్ బ్యాచ్ గా పేరుతెచ్చుకున్న అమర్, శోభాశెట్టి, ప్రియాంక.. ఎప్పుడు కలిసి ఉండేవారు. గేమ్ అయిన బయట అయిన గ్రూపిజం చేస్తు ఉండటంతో ప్రేక్షకులలో వీరిపట్ల నెగెటివిటి పెరిగిపోయింది. దాంతో శోభాశెట్టిని గ్రాంఢ్ ఫినాలే ముందు వారంలో బయటకు పంపించారు. ఇక టాప్-5 లో ఒకరిగా ఉన్న ప్రియాంక జైన్. అయిదవ కంటెస్టెంట్ గా ఎలిమినేషన్ అయి బయటకొచ్చింది. ఆ తర్వాత తన యూట్యూబ్ ఛానెల్ లో వ్లాగ్స్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది. నా కళ్ళకి సర్జరీ వళ్ళ మీ ముందుకు రాలేకపోతున్నానంటూ రీసెంట్ గా చేసిన వ్లాగ్ ఫుల్ వైరల్ అయింది.
ఓవైపు ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ లతో తన అభిమానులకి దగ్గరగా ఉండగా మరోవైపు తన ప్రియుడు శివ్ తో కలిసి వ్లాగ్స్ చేస్తుంది. ' అమ్మకి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ మేము చేసిన తప్పు మీరు చేయకండి ' అంటూ మరో వ్లాగ్ ని తాజాగా అప్లోడ్ చేసింది. ఇందులో ఏం చెప్పిందంటే.. ప్రియాంక హౌస్ లో ఉన్నప్పుడే తెలిసిందంట కానీ శివ్ బిగ్ బాస్ చూస్తూ బిజీగా ఉన్నాడు. ప్రియంక వాళ్ళ అమ్మను హాస్పిటల్ కి తీసుకెళ్తానని శివ్ అడిగిన తను రాకుండా పర్లేదని చెప్పిందని అన్నాడు. ఇక బిగ్ బాస్ తర్వాత రీసెంట్ గా ప్రియాంక, ఆమె తమ్ముడు కలిసి హాస్పిటల్ కి తీసుకెళ్ళి చెకప్ చేస్తే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ అని తెలిసిందంట. అది తెలిసి అంతా షాక్ అయ్యారంట. మేము ఒక రెండు మూడు నెలల ముందే చూపిస్తే బాగుండేదంటూ ఈ వీడియోలో ప్రియాంక, శివ్ లు చెప్పుకొచ్చారు. ఇప్పుడు క్రిటికల్ కాంప్లెక్స్ రూమ్ లో ఉంచారని రేపు ఆపరేషన్ తర్వాత తెలుస్తుందని డాక్టర్స్ చెప్పారంటూ ప్రియాంక ఏడుస్తూ చెప్పింది. ఇలా ప్రియాంక జైన్ ఎమోషనల్ అవ్వడంతో తన అభిమానులతో పాటు బిగ్ బాస్ ఫ్యాన్స్ కూడా రెస్పాండ్ అవుతున్నారు. దాంతో ఈ వ్లాగ్ ఇప్పుడు ఫుల్ వైరల్ గా మారింది.