English | Telugu
గుప్పెడంత మనసు సీరియల్ కి శుభం కార్డు?
Updated : Feb 1, 2024
కొన్ని సీరియల్స్ కి ఉండే ఫ్యాన్ బేస్ మరికొన్ని సీరియల్స్ కి ఉండరు. 'కార్తీకదీపం' సీరియల్ లో డాక్టర్ బాబు వంటలక్క, 'ఎన్నెన్నో జన్మలబంధం' సీరియల్ లో వేద , యష్ ల ఆన్ స్క్రీన్ జంటకి చాలా ఫ్యాన్ బేస్ ఉంది. మళ్ళీ అదే రేంజ్ లో 'గుప్పెడంత మనసు' సీరియల్ లోని రిషి, వసుధారలకే అంత ఫ్యాన్ బేస్ ఉంది.
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ లో.. డిబిఎస్టీ కాలేజీలో ఒక స్టూడెంట్ గా వసుధార జాయిన్ అవుతుంది. ఆ తర్వాత కాలేజీ టాపర్ గా నిలుస్తుంది. అప్పుడే తను రిషికి నచ్చేస్తుంది. అలా ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అయితే వీరిద్దరు ఎప్పుడు గొడవపడుతూ ప్రేమతో ఉంటారు. దాంతో వీరిద్దరిని ఈ సీరియల్ ఫ్యాన్స్ 'రిషీధార' అని పిలుచుకుంటారు. అయితే మొదట్లో రాజీవ్ వీరిద్దరి ప్రేమకు అడ్డుగా వచ్చాడు. ఇక కొన్ని నెలల క్రితం దేవయాని-ఫణీంద్రల కొడుకు శైలేంద్ర అడ్డుగా వచ్చాడు. శైలేంద్రకి డీబీఎస్టీ కాలేజీ ఎండీ పదవిని దక్కించుకోవాలని ఆశ ఉండటంతో దానికి అడ్డుగా ఉన్న రిషిని రౌడీలతో కిడ్నాప్ చేపించి కొట్టిస్తాడు. ఇక ఆ రౌడీలనుండి తప్పించుకున్న రిషి ఓ దగ్గర గాయాలతో పడి ఉంటాడు. అది చూసిన ఇద్దరు ముసలివాళ్ళు రిషిని కాపడతారు. ఇక వసుధార, అనుపమ, మహేంద్ర, ముకుల్ అందరు కలిసి రిషి కోసం వెతుకుంటారు. ఆ టైమ్ లో రిషి మెలుకువలోకి వచ్చి వసుధారకి కాల్ చేసి.. నేను బ్రతికే ఉన్నానని చెప్తాడు.
రిషి ఎక్కడ ఉన్నాడో చెప్పాక వసుధార వెళ్ళి తీసుకొని వస్తుంది. ఒక సీక్రెట్ ప్లేస్ లో వాళ్ళ నాన్న చక్రపాణిని కాపాల పెట్టి వైద్యం చూపిస్తుంటుంది. అయితే రాజీవ్, భద్ర, శైలేంద్ర కలిసి రిషి కోసం తీవ్రంగా గాలిస్తుంటారు. అయితే అదే సమయంలో కాలేజీలో యూత్ ఫెస్టివల్ జరుగుతుంది. కాలేజీలోని స్టూడెంట్స్ అంతా రిషి రావాలని కోరడంతో.. వసుధార వాళ్ళ నాన్న చక్రపాణికి ఫోన్ చేసి రిషిని తీసుకొని రమ్మంటుంది. అలా రిషిని చక్రపాణి తీసుకొని వస్తుంటే ఎవరో తన మీద కొట్టి పడేస్తారు. అదే విషయం వసుధారకి చెప్పగా తను కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆ తర్వాత యూత్ ఫెస్టివల్ కి వచ్చిన మినిస్టర్.. వసుధార ఎండీగా వచ్చినప్పటి నుండే ఇదంతా జరుగుతుందని అంటాడు. అయితే రిషి గత కొన్ని ఎపిసోడ్ లుగా కన్పించడం లేదు. ఇదే విషయాన్ని ఈ సీరియల్ ఫ్యాన్స్ ఇన్ స్ట్రాగ్రామ్ ఫ్యాన్ పేజీలలో చెప్తూ వస్తున్నారు. మరి రిషి పాత్ర ముగిసిందా? లేక అతని స్థానంలో ఇంకొకరు వస్తారా? లేక ఈ సీరియల్ నే ముగిస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.