English | Telugu

సింగర్ గీతా మాధురి సీమంతం...వైరల్ అవుతున్న పిక్స్


టాలీవుడ్‌ స్టార్‌ సింగర్‌, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ గీతామాధురి మరో సారి అమ్మ కాబోతోంది. త్వరలో మరో బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఆల్రెడీ గీతా-నందు జంటకు దాక్షాయనిప్రకృతి అనే కూతురు ఉంది. ఫిబ్రవరిలో దాక్షాయనికి తోడుగా ఓ బుజ్జాయి రాబోతోందని డిసెంబర్‌లో చెప్పింది గీతా మాధురి. తాజాగా ఆమెకు సీమంతం జరిగింది. కుటుంబ సభ్యులు, గీత ఫ్రెండ్స్, వెల్ విషర్స్ మధ్య ఈ ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. అందమైన పట్టు చీరలో మెరిసిపోయింది గీతా మాధురి. సీమంతం చేసే వేదికను కూడా అందంగా ముస్తాబు చేసారు. ప్రస్తుతం ఈ పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ సెకండ్ సీజన్‌లో గీతా మాధురి రన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే.

గీత, నందుది లవ్ మ్యారేజ్ అన్న విషయం అందరికీ తెలుసు 2014లో వీళ్ళ మ్యారేజ్ కూడా పెద్దల సమక్షంలో గ్రాండ్ గా జరిగింది. నందు కూడా మూవీస్ లో, వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. రీసెంట్ గా ఢీ షోకి హోస్ట్ గా చేస్తున్నారు అలాగే క్రికెట్ కామెంటేటర్ గా ఉన్నారు. రీసెంట్ గా నందు నటించిన మ్యాన్షన్‌ 24, వధువు వెబ్‌ సిరీస్‌ లు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. నందు ఎలివేట్ అయ్యే రోల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇకపోతే నందు తాను మరో సారి తండ్రి కాబోతుండడంతో ఎంతో సంతోషంగా ఉన్నాడు. అలాగే ఆహా ప్లాట్ఫారం పై రీసెంట్ గా డగౌట్ అనే గేమ్ షోకి హోస్ట్ గా కూడా చేసాడు. ఈ మధ్య కాలంలో గీతా, నందు డివోర్స్ తీసుకుంటున్నారంటూ ఫేక్ న్యూస్ వైరల్ అయ్యింది. అసలే ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాక డివోర్స్ ఎలా తీసుకుంటాం అంటూ ఇద్దరూ ఆ న్యూస్ ని నమ్మొద్దు అని క్లారిటీ ఇచ్చారు. వధువు వెబ్ సిరీస్ లో నందు కీ రోల్ ప్లే చేశారు. ఫస్ట్ సిరీస్ సూపర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు అసలు నందు రోల్ ఎలా మలుపు తిరగబోతోంది అనే విషయమై సెకండ్ సిరీస్ కోసం ఆడియన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి ఆనందకర సమయంలో నందుకు, గీతకి విషెస్ చెప్తున్నారు నెటిజన్స్.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.