English | Telugu
బిగ్ బాస్ అంటే వంటల షోనా..అక్కడికి వెళ్లి వంటలు చేయాలా
Updated : Feb 2, 2024
సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా స్ట్రీట్ ఫుడ్ కుమార్ ఆంటీ గురించిన టాకే నడుస్తోంది. రీసెంట్ గా ఆమె పుట్టిన ఊరు గుడివాడలో జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ఇల్లు తప్ప తనకు ఎలాంటి ఆస్తి లేదని చెప్పిన కామెంట్స్ వలన తన ఫుడ్ బిజినెస్ పై వేటు పడిందంటూ సోషల్ మీడియా కోడై కూసింది. దాంతో ట్రాఫిక్ కి ఇబ్బంది కలిగిస్తున్నారన్న నెపంతో పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఐతే ఇదంతా సోషల్ మీడియాలో రావడం నెటిజన్స్ అంతా కూడా కుమార్ ఆంటీకి సపోర్ట్ గా వీడియోస్, పిక్స్, కంటెంట్ పోస్ట్ చేస్తూ సపోర్ట్ చేయడాన్ని రేవంత్ సర్కార్ గమనించింది. దాంతి ఆమె బిజినెస్ కి ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా ఆమె మీద కేసు అదీ ఏమీ పెట్టొద్దంటూ త్వరలో తానూ కుమారి ఆంటీ ఫుడ్ కోర్ట్ ని విజిట్ చేస్తానంటూ ట్వీట్ చేశారు. ఇక ఈమె ఆనందం మాములుగా లేదు.
ఇక్కడి వరకు ఒక ఎత్తు ఐతే ఇప్పుడు కొత్త టాక్ నడుస్తోంది. సోషల్ మీడియా సెలెబ్రిటీస్ ని బిగ్ బాస్ గాలం వేసి పట్టుకుంటుందన్న విషయం తెలిసిందే కదా. అలా రాబోయే బిగ్ బాస్ సీజన్ 8 కి ఆమె వెళ్తుంది అంటూ ఒక న్యూస్ వైరల్ అవుతోంది. ఐతే బిగ్ బాస్ అంటే ఏంటో కూడా కుమారి ఆంటీకి తెలీదు. "బిగ్ బాస్ కంటెస్టెంట్ గా మిమ్మల్ని హౌస్ లోకి పంపిస్తే ఏం చేస్తారు" అని అడిగేసరికి "అంటే అదేమన్నా వంటల ప్రోగ్రామ..అందులో వంటలు చేస్తారా..నేను వెళ్లి అక్కడ వంటలు చేయాలా ?" అని అడిగింది..దీని బట్టి కుమారి ఆంటీకి బిగ్ బాస్ షో అంటే ఏంటో కూడా తెలీదని విషయం తెలుస్తోంది. తనకు బిగ్ బాస్ షో అంటే తనకు తెలీదని కేవలం నాలుగు సీరియల్స్ మాత్రమే చూస్తానని అలాగే తన భర్త పెట్టే న్యూస్ ఛానెల్స్ ని మాత్రమే చూస్తానని చెప్పింది. అలాగే ఆ నాలుగు సీరియల్స్ కూడా భోజనం చేసేటప్పుడు మాత్రమే చూస్తానని వేరే ఏవీ చూసే అవకాశం ఉండదు.. పనే సరిపోతుంది అని మరో ఇంటర్వ్యూలో చెప్పింది కుమారి ఆంటీ. కుమారి ఆంటీ చాలా తక్కువగా ధరకే ఫుడ్ అందిస్తూ ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకుంది.