English | Telugu

సూపర్ జోడి షో పెట్టింది మా కోసం కాదు రఘు మాస్టర్  కోసం

సూపర్ జోడి నెక్స్ట్ వీక్ లాంఛ్ 2 ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ లాంఛ్ ఎపిసోడ్ కి సందీప్ కిషన్ ఎంట్రీ ఇచ్చారు. ఇక సందీప్ కిషన్ రావడంతోనే తన చిన్నప్పటి క్రష్ మీనా అని చెప్పాడు. తర్వాత దిలీప్-యాష్మి జోడి మంచి హాట్ పెర్ఫార్మెన్స్ తో డాన్స్ చేశారు అది కూడా ముత్తు మూవీ నుంచి థిలాన థిలాన సాంగ్ కి డాన్స్ చేసేసరికి మీనా ఫిదా ఐపోయింది. ఇక దిలీప్ తన హార్ట్ మీద మీనా అని రాసుకుని ఆమెను ఇంప్రెస్ చేసాడు. తర్వాత రిచర్డ్-పల్లవి- నిసర్గ డాన్స్ పెర్ఫార్మ్ చేశారు. రిచర్డ్ కి అసలు జోడీని నేనంటే నేను అంటూ ఇద్దరమ్మాయిలు కొట్టుకునేసరికి మీనాకు అల్లరి మొగుడు మూవీ డేస్ గుర్తొచ్చాయని చెప్పి నవ్వేసింది.

రిచర్డ్ కోసం పల్లవి- నిసర్గ పోటీ పడేసరికి సందీప్ కిషన్ వెళ్లి భయ్యా ఇదేదో నేర్పిస్తే బుక్ పబ్లిష్ చేసి అందరికీ ఇస్తాం అని డైలాగ్ వేసాడు. తర్వాత అంజనా-సంతోష్ వచ్చి మంచి హాట్ డాన్స్ పెర్ఫార్మ్ చేశారు. ఇక అంజనా రఘు మాస్టర్ ని చూసి ఫిదా ఐపోయిన విషయం చెప్పింది. "ఫుల్ కర్లీ హెయిర్ తో బాగా డాన్స్ చేస్తోంది ఎవరా అని చూసేసరికి రఘు మాస్టర్.. అప్పుడు అలా తనకు క్రష్ అయ్యారు" అని చెప్పింది. ఆ డైలాగ్ కి రఘు మాస్టర్ తెగ సిగ్గుపడిపోయాడు. "ఇంతవరకు డార్లింగ్ నిన్ను ఇంతలా సిగ్గు పడగా చూసిందే లేదు. జడ్జ్ చైర్ లో మొదలైన సిగ్గు స్టేజి మీదకు వచ్చేవరకు కంటిన్యూ అయ్యింది " అంటూ కామెంట్ చేసాడు. "ఈ అంజనా చాలా అందంగా ఉంటుంది" అని చెప్పాడు రఘు మాస్టర్. ఆ మాటలకు యాంకర్ శివ నిలబడి "సూపర్ జోడి షో పెట్టింది మా కోసం కాదు రఘు మాస్టర్ కోసం" అనేసరికి అందరూ నవ్వేశారు. తర్వాత కృష్ణ మాస్టర్- తనూజ వచ్చి డాన్స్ చేశారు. ఇక తనూజాతో కలిసి సీరియల్ నటి హరిత వచ్చింది. తనూజాకు దిష్టి తగలకుండా ఉండడం కోసం దిష్టి తియ్యడానికి వచ్చానని చెప్పి తనూజ కాలికి నల్ల తాడు కట్టి అరికాలిలో కాటుక చుక్క పెట్టి హారతి ఇచ్చి మరీ దిష్టి తీసింది. "థ్యాంక్స్ టు అమ్మ. తనూ కోసం రండి అంటే అన్నీ పక్కన పెట్టేసి నా కోసం వచ్చారు" అంటూ తనూజ్ చాలా ఎమోషనల్ అయ్యింది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.