English | Telugu
యావర్ తో నా బంధం ఎప్పటికీ అపురూపమే....
Updated : Feb 2, 2024
రీసెంట్ బుల్లితెర నటీనటులకు పద్మ మోహన అవార్డ్స్ లభించిన విషయం తెలిసిందే. అలా అవార్డ్స్ దక్కిన అందరూ ఆ పిక్స్ ని తమ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకున్నారు. అలాగే బ్రహ్మముడి విలన్ గర్ల్ హమీద అలియాస్ స్వప్న కూడా ఆ అవార్డు ని అందుకున్న ఒక పిక్ ని కూడా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది. దాంతో పాటు బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ యావర్ తో దిగిన ఫోటోని షేర్ చేసింది. ఆ పిక్స్ మీద బ్రదర్ అండ్ సిస్టర్ లవ్ అంటూ రాసుకుంది. " నా సోదరుడు ప్రిన్స్ యావర్‌తో ఉన్న బంధం ఎంతో అపురూపమైనది. బిగ్‌బాస్ 7 నుంచి పద్మమోహన అవార్డ్స్ వరకూ యావర్‌తో గడిపిన క్షణాలను సెలబ్రేట్ చేసుకున్నాను.
మా నవ్వులు, మేము షేర్ చేసుకున్న ఎన్నో సంగతులను ఎప్పటికీ మర్చిపోలేను." అంటూ హమీదా క్యాప్షన్ పెట్టుకుంది. నెటిజన్స్ వీళ్ళ రిలేషన్ కి ఫిదా ఐపోతున్నారు. "బిగ్ బాస్ సీజన్ లో జెన్యూన్ గా ఆడిన కంటెస్టెంట్ యావర్ ని సపోర్ట్ చేసావ్.. దాంతో నీ మీద ఇంకా గౌరవం పెరిగింది...నాకు ఇష్టమైన ఫెవరేట్ బీబీ కంటెస్టెంట్స్ ఒకే ఫ్రేమ్ లో ఉన్నారు." అంటూ కామెంట్స్ చేస్తున్నారు. హమీదా ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్‌లో నెగెటివ్ షేడ్స్ ఉన్న స్వప్న రోల్ లో శ్రీకర్ కృష్ణకి జోడీగా నటిస్తోంది. బిగ్‌బాస్ సీజన్ -5లో పార్టిసిపేట్ చేసింది హమీద. ఎక్కువ రోజులు హౌస్‌లో లేకపోయినప్పటికీ హమీద మాత్రం మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఇక శ్రీకర్ కృష్ణ హమీద ఇద్దరూ కలిసి ఆఫ్ స్క్రీన్ లో చేసే రీల్స్ కి మంచి వ్యూస్ వస్తూ ఉంటాయి. బుల్లితెర మీద షోస్ లో, ఈవెంట్స్ లో రెగ్యులర్ గా కనిపిస్తూనే ఉంది. అలాగే ఇప్పుడు మూవీస్ లో మంచి రోల్స్ వస్తే చేయడానికి రెడీ ఉన్నట్లు పలు ఇంటర్వ్యూస్ లో చెప్పింది హమీద.