English | Telugu
ఇండస్ట్రీలో మాస్ మహారాజ రవితేజ వాడినన్ని బీప్స్ ఎవరూ వాడలేదు
Updated : Feb 2, 2024
ఉస్తాద్ ఈ వారం షోకి మాస్ మహారాజ రవితేజ ఎంట్రీ ఇచ్చారు. ఇక రావడంతోనే "అన్నా మీరు హోస్టింగ్ చేస్తే చూడాలని ఉంది" అని మనోజ్ అనేసరికి రవితేజ ఒక నవ్వు నవ్వేశారు. "మీరు హోస్టింగ్ చేస్తే అవతలోడు గోస్టింగ్ ఐపోతాడేమో అని ఆన్సర్ ఇచ్చాడు మనోజ్. తర్వాత కృష్ణ మూవీలో "నీ సోకుమాడ" సాంగ్ వేసి "అన్నా మీ రియల్ లైఫ్ లో ఇలా తిడుతూ ఎవరినైనా ప్రొపోజ్ చేశారా" అని మనోజ్ అడిగేసరికి లేదన్నారు రవితేజ. "పోనీ మీకెవరన్న ప్రొపోజ్ చేశారా" అంటే "వదిలేయ్ అవన్నీ అన్నట్టుగా" సైగలు చేసి చూపించారు.
"నేను ఒక విషయం విన్నాను ఇండస్ట్రీలో మీరు వాడినని బీప్స్ ఇంకెవరూ వాడరంట" అనేసరికి " అందరూ వాడతారు కానీ నేను కొంచెం ఎక్కువ ఓపెన్ గా వాడతాను" అంతే అన్నాడు రవితేజ. "అవును నన్ను బీప్ అంటున్నావ్.. నీకు తమిళ్, తెలుగు, ఇంగ్లీష్ లో కలిపి కదా బీప్స్ ఉంటాయి. నీకేదో బీప్స్ లేనట్టు బుద్ధిమంతుడివి ఐనట్టు..నువ్వు అడగడం నేను పక్కకు రా చెప్తాననడం" అంటూ కామెడీ చేసాడు. "తెలుగు వాళ్ళతో మాట్లాడే టప్పుడు తమిళ్ లో బీప్ లో తిడతాను తమిళ్ వాళ్ళని తెలుగు బీప్ లో తిడతాను..వాళ్లకు అర్ధం కాదు కదా" అన్నాడు మనోజ్. "ఏది జరిగిన పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉండడమే" అని చెప్పాడు రవితేజ. తర్వాత కొంతమంది స్టూడెంట్స్ రవితేజని కొన్ని ప్రశ్నలు వేశారు. వాటికీ ఆన్సర్స్ కూడా ఇచ్చారు. "నేను అన్ని మీమ్స్ ట్రోల్స్ ఎంజాయ్ చేస్తాను..నేను మూవీస్ చూసా కానీ థియేటర్ లో ఎగరడాలు, డాన్స్లు చేయడాలు, డబ్బులు విసరడాలు ఏమీ చేయలేదు. ఫస్ట్ డే మార్నింగ్ షో చూసేయాల్సిందే. నేను ఒకళ్ళకు టాక్ చెప్పాలి కానీ నాకు ఒకళ్ళు నాకు టాక్ చెప్పడం కాదు.. మోక్షద, మహాధన్ ఇద్దరూ సిట్యుయేషన్ బట్టి రియాక్ట్ అవుతారు. మహాధన్ నాకంటే పిచ్చ క్లారిటీగా ఉన్నాడు. వాడి వయసుకు మెచ్యురిటీకి సంబంధమే లేదు. వాడి లెక్కలు వాడికున్నాయి. సినిమా ఎంటర్టైన్మెంట్ మాత్రం కొన్ని మూవీస్ ఇన్స్పిరేషనల్ గా ఎంతో మంచి చేసేవి కూడా ఉంటాయి" అని చెప్పాడు రవితేజ.